రండి... దేశాభివృద్ధిలో కీలక భాగస్వాములు కండి
గాంధీనగర్: దేశాభివృద్ధిలో కీలక భాగస్వాములు కావాలని ఎన్నారై యువతకు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ పిలుపునిచ్చారు. బుధవారం గాంధీనగర్‌లో ప్రారంభమైన ప్రవాస్ భారతీయ దివాస్‌లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుష్మా... ఎన్నారై యువతతో ముఖాముఖీ కార్యక్రమాన్ని నిర్వహించారు.
స్వదేశంలో ఎన్నారైలు వ్యాపారాలు నిర్వహించేందుకు మోదీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సుష్మా స్వరాజ్ వివరించారు. అలాగే దేశంలో మౌలిక సదుపాయాల అభివృద్ధితో తమ ప్రభుత్వం చేపట్టిన విధి విధానాలన్నీ పాదర్శకంగా అమలు పరుస్తున్నట్లు తెలిపారు. కమ్, కనెక్ట్, సెలబ్రెట్, కంట్రిబ్యూట్ అంటూ 'నాలుగు సీ'ల ప్రాముఖ్యతను సుష్మా ఈ సందర్భంగా ఎన్నారై యువతకు విశదీకరించారు.