‘మహా’ మత్తు
2013లో డ్రగ్స్మాఫియా వ్యాపారం - రూ.400 కోట్లు
గ్రేటర్లో మత్తుకు బానిసలైన వారి సంఖ్య - 50 వేలు
నగరంలో గ్రాము కొకైన్ ధర - రూ.4,000
నగరంలో ప్రతినెలా గంజాయి అమ్మకం - 1,500 కిలోలు
హైదరాబాద్‌లో డ్రగ్ ముఠాలు - 40
డ్రగ్స్ మాయలో నగర యువత
నిఘా నేత్రం నిద్రపోతోంది.. డ్రగ్స్ మాఫియాకు హైదరాబాద్ అడ్డాగా మారుతోంది... యువత కిక్కెక్కి తిరుగు తోంది... పెద్దోళ్ల ముద్దుబిడ్డల నుంచి అడ్డా కూలీల వరకు అందరినీ డ్రగ్స్ ముఠా విష వలయంలో బంధిస్తోంది.. రూ. 400 కోట్లు... భాగ్యనగరంలో ఒక్క ఏడాదిలో డ్రగ్స్ ముఠాలు దండుకుంటున్న మొత్తం ఇదీ అంటే ఆశ్చర్యం కలుగక మానదు... కనీసం 50 వేల మంది నగరవాసులు డ్రగ్సకు బానిసలయ్యారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. వీరిలో 80 శాతం మంది యువతే. యువతుల సంఖ్య కూడా తక్కువేమీ కాదు. ఈ జాడ్యం నుంచి బయటపడేందుకు 5 వేల మంది ఇప్పటికే డ్రగ్స్ డీఎడిక్షన్ సెంటర్స్‌ను ఆశ్రయించారు. ‘మతు’్తలో చిత్తవుతున్న మహానగరం పూర్తి వివరాలు ఇవీ..
గిరాకీ ఎంత...?
నగరంలో ప్రస్తుతం ఒక గ్రాము కొకైన్ ధర రూ.నాలుగు వేలు. గత మూడేళ్లలోనే గంజాయి అమ్మకాలు నెలకు 500 కిలోల నుంచి 1500 కిలోలకు పెరిగాయి. విశాఖ, వరంగల్, ఖమ్మం జిల్లాల నుంచి గంజాయిని నగరానికి తరలిస్తున్నారు.
స్వదేశానికి ఇలా...
దక్షిణాఫ్రికా, కెన్యా, నైజీరి యాల్లో విరివిగా లభించే కొకైన్, బ్రౌన్షుగర్లను ఢిల్లీ, చెన్నై, బెంగళూరు మీదుగా నగరానికి తీసుకు వస్తున్నారు. నేపాల్ సరిహద్దుల్లో దొరికే హెరా యిన్‌ను, పాకిస్థాన్, అఫ్ఘానిస్థాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ నుంచి గంజాయిని సేకరించి అక్కడే వీటిని మ్యాండ్రాక్స్, హెరాయిన్, కొకైన్, కెటామైన్ల రూపంలోకి మార్చి నగరానికి తీసుకొస్తున్నట్లు డీఐఆర్ పరిశీలనలో తేలింది. కొకైన్ తయారీకి ఉపయోగించే గసగసాల మొక్కలను కర్నాటకలోని కోలార్, బెంగళూరు రూరల్, చిక్కబళ్లాపూర్ జిల్లాల్లో, తమిళనాడులోని నీలగిరిలో పండించి నగరానికి తీసుకు వస్తున్నారు.
అసలు దొంగలు వీరే?
రాజధానిలో డ్రగ్స్ ముఠాల వెనుక ఇతర దేశస్తుల పాత్ర ఉన్నట్లు కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో చెబుతోంది. నగరంలోని పలు ప్రాంతాల్లో వసతి ఏర్పాటు చేసుకుని విదేశాల నుంచి వచ్చే సరుకును గమ్యస్థానాలకు చేర్చే కార్యక్రమం పూర్తిగా వీరే నిర్వహిస్తున్నారు. నగరా నికి చెందిన ఉన్నత కుటుంబాలతోనూ వీరికి సంబంధాలున్నాయి. వీళ్ల ఫోన్ నంబర్ల నుంచి ప్రముఖులకూ కాల్స్ వెళుతుండటం గమనార్హం. డ్రగ్స్ తరలింపులో పట్టుబడిన ప్రతి వ్యక్తి సెల్ఫోన్లలో సినీ ప్రముఖులు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ల నంబర్లు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. కానీ, వారి పూర్తి వివరాలను పోలీసులు వెల్లడించడం లేదు.
తారలూ పాత్రధారులే..?
ఇటీవల ఆరుగురు ప్రముఖ నటులు, ఎనిమిదిమంది తెలుగు నిర్మాతలకు డ్రగ్స్ మాఫియాతో సంబంధాలున్నట్లు తేలింది. మాఫియాతో సంబంధాలున్న వారిలో 16 మంది సినీ ప్రముఖులు న్నారని సమాచారం. హీరో రవితేజ సోదరుడు (రఘు)కి డ్రగ్స్ మాఫియాతో సంబంధాలున్నట్లు గతంలో కేసులు నమోద య్యాయి. ఆయనను విచారించిన పోలీసులు ముగ్గురు హీరోయిన్లు, ఐదుగురు హీరోలతో ఉన్న లింకులను పసిగట్టారు. కానీ వాళ్లను అరెస్టు చేయలేదు.
దానిమ్మలో హెరాయిన్.. పుస్తకాల్లో కొకైన్..
డ్రగ్స్ తరలింపునకు మాఫియా కొత్త మార్గాలు అన్వేషిస్తోంది. స్థానిక యువతకు కొరియర్ కంపెనీల్లో ఉద్యోగాలిచ్చి మత్తు పదార్థాలను హైదరాబాద్‌కు తరలిస్తుంది. హెరాయిన్‌ను దానిమ్మ కాయ లోపల, బీర్ టిన్‌లో, షూస్ అడుగు భాగంలో, వాహనాల బ్యాటరీ మధ్యలో, ఎల్పీజీ సిలిండర్లలో పెట్టి రవాణా చేస్తున్నారు. కొకైన్‌ను పుస్తకాలు, పెన్నుల మధ్యలో పెట్టి సరఫరా చేస్తున్నారు.
అడ్డుకోవడంలో అడ్డంకులు
నగరంలోకి మాదకద్రవ్యాల సరఫరా ఎంత కట్టడి చేసినా అడ్డుకో వడం కష్టమని నిఘా వర్గాలు చేతులెత్తేస్తున్నాయి. పబ్బులు, డ్రగ్ కల్చర్ నానాటికి నగరంలో విస్తరిస్తోంది. యువతలో ఎక్కువ మంది బడాబాబుల బిడ్డలు కావడంతో అడ్డంకులు తప్పడంలేదు.
మత విశ్వాసాల వినియోగం..
కొన్ని విగ్రహాలు ఇక్కడి నుంచి మలేసియా, సింగపూర్‌కు ఎగుమతి అవుతాయి. ఇవి మత విశ్వాసాలకు ప్రతీక. ఈ కారణంగా వీటిని తనిఖీ చేయాలంటే పోలీసులకు ఇబ్బంది. దీన్ని ఆసరాగా తీసుకొని విదేశాల్లో భారీ గిరాకీ ఉన్న ఎఫిడ్రిన్‌ను విగ్రహాల మధ్యలో పెట్టి తరలిస్తున్నారు. సింగపూర్‌లో ఎఫిడ్రిన్ ధర కిలో రూ.50 లక్షల వరకు పలుకుతోంది. అలాగే, కెనడా నుంచి దిగుమతి అయిన టవల్స్ నుంచి ఇటీవల కిలోల కొద్దీ ఎఫిడ్రిన్‌ను నగరంలో స్వాధీనం చేసుకున్నారు. సికింద్రాబాద్‌లోని ఒక్క శ్రుతి బల్క్ డ్రగ్స్ కంపెనీయే మూడేళ్లలో 3,300 కిలోల కేటామిన్ హైడ్రోక్లోరైడ్ ఇంజెక్షన్లను అక్రమంగా దిగుమతి చేసిందని ఔషధ నియంత్రణ పరి పాలన మండలి డీజీ తెలిపారు. అనుమతి లేని ఈ సంస్థపై దాడులు కూడా చేశారు. ఇలాంటి పలు కంపెనీల్లో పెద్దమొత్తంలో మత్తు పదార్థాలు ఉండే అవకాశం ఉంది.