Different roles
-
పలు గెటప్స్‌లలో కనిపించనున్న టాప్ హీరోలు
అభిమాన హీరోలు వెండితెరపై ఒక గెటప్‌లో కనిపిస్తేనే ఫ్యాన్స్ ఖుషీ అవుతారు. అలాంటిది ఆ స్టార్ హీరో పలు రకాల గెటప్స్‌లో కనిపిస్తే ఆ ఖుషీ డబుల్ అవుతుంది. అలా డిఫరెంట్ గెటప్స్‌లో కనిపించే కథలు కొందరు స్టార్స్‌కి సెట్ అయ్యాయి. ఒక్కో హీరో మినిమమ్ నాలుగు, ఇంకా ఎక్కువ గెటప్స్‌లో కనిపించనున్నారు. గెట్.. సెట్.. గెటప్స్ అంటూ ఆ స్టార్స్ చేస్తున్న చిత్రాల గురించి తెలుసుకుందాం. విభిన్న భారతీయుడు విభిన్నమైన గెటప్స్‌లో కనిపించడం కమల్‌హాసన్‌కు కొత్తేం కాదు. ‘దశావతారం’లో కమల్ పది పాత్రల్లో పది గెటప్స్ చేసి ఆడియన్స్‌ను ఆశ్చర్యపరిచారు. అన్ని పాత్రల్లో కాదు కానీ ‘ఇండియన్ 2’లో కమల్‌హాసన్ డిఫరెంట్ గెటప్స్‌లో కనిపించనున్నారని తెలుస్తోంది. 1996లో హీరో కమల్‌హాసన్, దర్శకుడు శంకర్ కాంబినేషన్లో వచ్చిన ‘ఇండియన్’ (తెలుగులో ‘భారతీయుడు’) సినిమాకు సీక్వెల్‌గా ‘ఇండియన్ 2’ వీరి కాంబినేషన్లోనే రూపొందుతోంది. 1920 నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుందని, ఇందులో కమల్‌హాసన్ నాలుగుకి మించి గెటప్స్‌లో కనిపిస్తారని కోలీవుడ్ టాక్. వీటిలో లేడీ గెటప్ ఒకటనే టాక్ తెరపైకి వచ్చింది. మహిళగా, 90 ఏళ్ల వృద్ధుడిగా, యువకుడిగా.. ఇలా విభిన్నంగా కనిపించడానికి కమల్‌కి ప్రోస్థటిక్ మేకప్ వేసుకోవడానికి, తీయడానికి మూడు గంటలకు పైగా పడుతోందని యూనిట్ అంటోంది. ఈ చిత్రం వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. పెయింటరా? సైంటిస్టా? పెయింటరా? రైతా? సైంటిస్టా? అసలు ‘ఈగిల్’ సినిమాలో రవితేజ క్యారెక్టర్ ఏంటి? అనే సందేహం తీరాలంటే ఈ సంక్రాంతి వరకూ వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే ఈ సినిమా రిలీజ్ అయ్యేది అప్పుడే. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న యాక్షన్ ఫిల్మ్ ‘ఈగిల్’. ఈ చిత్రంలో అనుపమా పరమేశ్వరన్ ఓ లీడ్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఇందులో రవితేజ ఐదారు గెటప్స్‌లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. వీటిలో ప్రొఫెషనల్ స్నైపర్ గెటప్ ఒకటి అని భోగట్టా. ఇంకా రవితేజ లుక్ విడుదల కాలేదు. పదికి మించి.. ప్రయోగాత్మక పాత్రలకు సూర్య ముందుంటారు. ‘సుందరాంగుడు’, ‘సెవెన్త్ సెన్స్’, ‘24’, ‘బ్రదర్స్’... ఇలా సూర్య కెరీర్లో వైవిధ్యమైన చిత్రాల జాబితా ఎక్కువే. ఈ కోవలోనే సూర్య నటించిన మరో చిత్రం ‘కంగువా’. శివ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో సూర్య పదమూడు గెటప్స్‌లో కనిపిస్తారనే టాక్ ఎప్పట్నుంచో వినిపిస్తోంది. 17వ శతాబ్దంలో మొదలై 2023కి కనెక్ట్ అయ్యేలా ‘కంగువా’ కథను రెడీ చేశారట శివ. రెండు భాగాలుగా విడుదల కానున్న ‘కంగువా’ తొలి భాగం వచ్చే ఏడాది ఏప్రిల్‌లో విడుదల కానున్నట్లు తెలుస్తోంది. స్టూడెంట్.. రాజకీయ నాయకుడు కాలేజ్ స్టూడెంట్, ఐఏఎస్ ఆఫీసర్, రాజకీయ పార్టీ కార్యకర్త... ఇలా ‘గేమ్ చేంజర్’ సినిమాలో రామ్‌చరణ్ ఏడు గెటప్స్‌లో కనిపిస్తారనే టాక్ ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్ కూడా ఉన్నాయి. రాజకీయ నాయకులకు, ఐఏఎస్ ఆఫీసర్లకు మధ్య నెలకొని ఉండే అంశాల నేపథ్యంలో ఈ సినిమా కథనం ఉంటుందట. ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. 2 దశాబ్దాలు.. 4 గెటప్స్ ‘తొలిప్రేమ’ (2018)లో వరుణ్ తేజ్ క్యారెక్టర్లో డిఫరెంట్ షేడ్స్ కనిపిస్తాయి. కాలేజీ కుర్రాడిలా, ఉద్యోగం చేసే వ్యక్తిగా కనిపిస్తారు. ఇదే తరహాలో వరుణ్ తేజ్ మరో సినిమా చేస్తున్నట్లు తెలుస్తోంది. అదే ‘మట్కా’. ఈ చిత్రంలో వరుణ్ తేజ్ నాలుగు గెటప్స్‌లో కనిపిస్తారని చిత్ర యూనిట్ వెల్లడించింది. వైజాగ్ నేపథ్యంలో 1958 నుంచి 1982 టైమ్ పీరియడ్‌లో ‘మట్కా’ కథనం ఉంటుంది. ‘పలాస’ ఫేమ్ కరుణకుమార్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ అక్టోబరు మొదటి వారంలో ప్రారంభం కానుంది. వచ్చే ఏడాది ఈ సినిమాను విడుదల చేస్తారు. పలు అవతారాల్లో స్మగ్లింగ్ స్మగ్లింగ్ చేస్తున్నారట కార్తీ. అది కూడా గోల్డ్ స్మగ్లింగ్. ఇందులో భాగంగా అధికారులను బోల్తా కొట్టించేందుకు తన గెటప్ మార్చుతుంటారట. ఇదంతా ‘జపాన్’ సినిమా కోసం. రాజు మురుగన్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఇది. గోల్డ్ స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని, ఇందులో కార్తీ డిఫరెంట్ గెటప్స్‌లో కనిపిస్తారని సమాచారం. ఈ చిత్రం ఈ దీపావళికి విడుదల కానుంది. -
మూడు పాత్రల్లో ఆది సాయి కుమార్.. అవేంటంటే ?
Aadi Sai Kumar Three Different Roles In Tees Maar Khan Movie: ఆది సాయికుమార్, పాయల్ రాజ్‌పుత్ జంటగా కల్యాణ్ జి. గోగణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘తీస్ మార్ ఖాన్’. సునీల్, పూర్ణ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నాగం తిరుపతి రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేశారు. ‘మనం ఆపాలనుకున్నంత పవర్ మన దగ్గర ఉన్నా.. మనం ఆపలేనంత పవర్ వాడి దగ్గర ఉంది.. సార్’, ‘బాగా రాసుకోండి.. బాగా కనపడాలి.. పేరు గుర్తుందిగా.. తీస్ మార్ ఖాన్’ అనే డైలాగ్స్ టీజర్లో ఉన్నాయి. ‘‘హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా చిత్రమిది. స్టూడెంట్, రౌడీ, పోలీస్.. ఇలా మూడు వేరియేషన్స్ ఉన్న పాత్రలో ఆది కనిపిస్తారు’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ సినిమాకు సాయికార్తీక్ సంగీతం అందిస్తున్నారు. చదవండి: మరో పెళ్లి చేసుకోబోతున్న సీనియర్ హీరో నరేష్ ! వికటించిన సర్జరీ.. గుర్తుపట్టలేని స్థితిలో హీరోయిన్ సినిమా సెట్లో ఇద్దరు నటులు మృతి.. ఆరుగురికి గాయాలు -
విభిన్న పాత్రల్లో కూల్ బ్యూటీ.. 2022లో 7 సినిమాలు
సినిమాల్లో ఇప్పటివరకు హీరోలే విభిన్న పాత్రలు చేస్తూ అలరించారు. కానీ ఈసారి ఒక హీరోయిన్ వివిధ రకాల పాత్రలతో సందడి చేయనుంది. ఆమె ఫిట్నెస్ సుందరి రకుల్ ప్రీత్ సింగ్. టాలీవుడ్లో ప్రార్థనగా (వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్) పరిచయమైన రకుల్ ప్రీత్ సింగ్ అతి తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్గా ఎదిగింది. ప్రస్తుతం టాలీవుడ్‌తో పాటు బీటౌన్‌లో వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. తాజాగా ఆమె నటించిన 7 సినిమాలు 2022లో విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. వాటిలో 6 చిత్రాలు బాలీవుడ్ మూవీస్ కావడం విశేషం. ఛత్రీవాలీ సినిమాలో రకుల్ కండోమ్ టెస్టర్‌గా కనిపించనున్నట్లు తెలిసిందే. (చదవండి: ప్రముఖ హీరోయిన్ ఇంట్లో చోరీ.. పోలీసులకు ఫిర్యాదు) దీంతోపాటు బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కీలక పాత్రల్లో నటిస్తున్న 'రన్ వే-34', అజయ్ దేవగణ్, సిద్ధార్థ్ మల్హోత్రాలతో 'థ్యాంక్ గాడ్', ఆయుష్మాన్ ఖురానా సరసన 'డాక్టర్ జీ', అటాక్‌తో పాటు మరొక చిత్రంలో నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ. తన సినిమాలు అందులో చేసే పాత్రల గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకుంది రకుల్. 'నా కెరీర్లో 2022 బాగుంటుందని ఆశిస్తున్నాను. నేను నటించిన 7 సినిమాలు విడుదలకు రెడీగా ఉన్నాయి. వాటిలో 6 హిందీ చిత్రాలే. ఆ సినిమాలన్నింటిని ప్రేక్షకులు ఆదరించాలి. ఈ చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించాను. ప్రతీ చిత్రం కొత్త జోనర్లో తెరకెక్కింది. 'ఛత్రీవాలీ'లో కండోమ్ టెస్టర్ పాత్రను పోషించగా, 'రన్ వే-34'లో ఫైలెట్‌గా కనిపిస్తాను. అలాగే 'అటాక్' సైన్స్ ఫిక్షన్ చిత్రం కాగా, 'డాక్టర్ జీ'లో గైనకాలజిస్ట్ రోల్ చేస్తున్నాను. గత రెండేళ్లుగా ఈ సినిమాల షూటింగ్ జరిగింది. థియేటర్లలో ఈ సినిమాలు ఎప్పుడెప్పుడూ విడుదల అవుతాయా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.' అని కూల్ బ్యూటీ చెప్పుకొచ్చింది. (చదవండి: ప్రభాస్ తర్వాత స్థానంలో అల్లు అర్జున్.. దేనిలో అంటే ? -
అందుకే ఎక్కువ సినిమాలు చేయలేకపోతున్నా!
‘‘ఎక్కువ సినిమాలు చేయాలనే తాపత్రయంలో ఏ కథ నా దగ్గరకు వస్తే ఆ కథకు ఓకే చెప్పాలనుకోవడంలేదు. కథాబలం ఉండి, నా పాత్ర సినిమాను ముందుకు నడిపించేలా ఉంటేనే ఒప్పుకుంటా’’ అంటున్నారు ఇలియానా. ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోయిన్గా దూసుకెళ్లిన ఈ బ్యూటీ ఆ తర్వాత హిందీకి వెళ్లారు. అక్కడికి వెళ్లిన మొదట్లో బాగానే అవకాశాలు వచ్చాయి. కానీ ఆ తర్వాత ఇలియానా చేతిలో ఏడాదికి ఒక సినిమా మించి ఉండటం లేదు. ఈ విషయం గురించి ఇలియానా ఇటీవల ఓ సందర్భంలో మాట్లాడుతూ – ‘‘ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు పాత్రల ఎంపికలో నా విధానం పూర్తిగా మారిపోయింది. ఎన్ని సినిమాలు చేశామన్నది కాదు.. ఎన్ని మంచి సినిమాలు చేశామన్నదే ముఖ్యం. ఆచితూచి సినిమాలను ఎంపిక చేసుకుంటున్నాను. డిఫరెంట్ రోల్స్ మాత్రమే చేయాలనుకుంటున్నాను. అందుకే నేను ఎక్కువ సినిమాలు చేయలేకపోతున్నాను. ఇప్పుడైతే అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ చేయాలని ఉంది. అలాంటి కథ కోసం చూస్తున్నాను’’ అన్నారు. ఇదిలా ఉంటే.. ఇలియానా నటించిన హిందీ చిత్రం ‘అన్‌ఫెయిర్ అండ్ లవ్లీ’ విడుదలకు సిద్ధమైంది. -
దయ్యాల అరుపులు వినిపించవు
‘‘కేవలం భయపెట్టేందుకే ఈ సినిమా తీశాం. ఇందులో నాలుగు కథలుంటాయి. ప్రతి కథ నుంచీ భిన్నమైన పాత్రలు పరిచయమవుతాయి. ఈ నాలుగు కథలు ఓ పాయింట్ దగ్గర కలుస్తాయి. అక్కడే ప్రేక్షకులు ఉత్కంఠకు గురవుతారు. అదేంటో తెరపైనే చూడాలి’’ అంటున్నారు దర్శక, నిర్మాత శ్రీకిశోర్. ఆయన రూపొందించిన హారర్చిత్రం ‘భూ’ నేడు విడుదల కానుంది. ఈ సందర్భంగా మాట్లాడుతూ -‘‘ఇందులో నక్కల ఊలలు, దయ్యాల అరుపులు ఏమీ వినిపించవు. రామ్‌గోపాల్‌వర్మ ప్రేరణతో పరిమిత వనరులతో నిర్మించిన చిత్రమిది’’ అని తెలిపారు శ్రీకిశోర్.