సమాంతర సినిమా నిర్మాణంపై ఉచిత వర్క్‌షాప్
సీతంపేట: తక్కువ ఖర్చుతో డిజిటల్ టెక్నాలజీ ఉపయోగించి సోషల్ మీడియా సహకారంతో సమాంతర సినిమా ఏ విధంగా నిర్మించాలి తదితర అంశాలపై ఆదివారం ఉదయం 9:30 గంటల నుంచి వర్క్‌షాప్ నిర్వహించనున్నారు. ప్రముఖ సమాంతర సినిమా దర్శకుడు క్యాంప్ శశి సినిమా నిర్మాణంపై ఉచితంగా అవగాహన కల్పించనున్నారు. ధరణి ఎన్జీవో ఆర్గనైజేషన్, ఆర్కే మీడియా హౌస్, వైజాగ్ ఫిల్మ్ సొసైటీ సంయుక్తగా వర్క్‌షాప్ నిర్వహిస్తున్నాయి. ఔత్సాహిక యువకులు, దర్శకులు, షార్ట్‌ఫిల్మ్‌ల రూపకర్తలు పాల్గొనవచ్చు. మరిన్ని వివరాలకు 9866084124 ఫోన్ నంబరును సంప్రదించవచ్చు.