dilip parulekar
-
మంత్రుల మధ్య 'బికినీ' వార్
పనాజీ: గోవా మంత్రుల మధ్య బికినీల గొడవ జరుగుతోంది. బీచ్‌ల్లో బికినీలు ధరించడంపై ఆ రాష్ట్ర పీడబ్ల్యూడీ మంత్రి సుదీన్ దావలికర్, టూరిజం మంత్రి దిలీప్ పరులేకర్ మధ్య విబేధాలు తలెత్తాయి. ఇందుకు గోవా అసెంబ్లీ వేదికైంది. బీచ్‌ల్లో బికినీలు ధరించడానికి టూరిజం మంత్రి అనుమతించడంపై దావలికర్ వ్యతిరేకిస్తున్నారు. వాళ్లు (విదేశీ టూరిస్టులు) బికినీలతో బీచ్‌ల బయటకు వస్తే తాను వ్యతిరేకిస్తానని దావలికర్ చెప్పారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. టూ పీస్ బికినీలు ధరించడం మన సంస్కృతి కాదని అన్నారు. కాగా అసెంబ్లీలో టూరిజం మంత్రి పరలేకర్ ఈ విషయంపై మాట్లాడుతూ.. 'టూరిజం మంత్రిగా బికినీలకు నేను వ్యతిరేకం కాదు. బీచ్‌లు, స్విమ్మింగ్ పూల్స్‌లో బికినీలు ధరించవచ్చు. అయితే సూపర్ మార్కెట్లు, ఆలయాల్లో కాదు. బీచ్ టూరిజానికి గోవా ప్రసిద్ధి. ఇక్కడికి యూరప్ పర్యాటకులు ఎక్కువగా వస్తారు' అని చెప్పారు. కాగా బికినీల నిషేధించాలని గోవా మంత్రులు సుదిన్ దావలికర్, దీపక్ దావలికర్ డిమాండ్ చేశారు. -
రేపిస్టులు ఒట్టి అమాయకులు: గోవా మంత్రి
పణాజి: 'గ్యాంగ్ రేప్ లు ఎక్కడ జరగడంలేదు చెప్పండి. ఇదిగో.. ఇద్దరు మహిళల్ని రేప్ చేసిన నిందితులున్నారే.. పాపం ఒట్టి అమాయకులు. నా దృష్టిలో ఇలాంటివి చాలా చిన్న సంఘటనలు. ఇలాంటి ఘటనలవల్ల మా ప్రాంతానికి, ఇక్కడ జరిగే వ్యాపార కార్యకలాపాలకు ఎలాంటి నష్టం వాటిల్లదు'.. ఇవీ బాధ్యత వహించిన గోవా పర్యాటక శాఖ మంత్రి దిలీప్ పరులేకర్ తాజా వ్యాఖ్యలు. ఢిల్లీకి చెందిన ఇద్దరు మహిళలపై ఐదుగురు యువకులు గ్యాంగ్ రేప్ కు పాల్పడిన ఘటనపై గురువారం రాత్రి మీడియాతో మాట్లాడుతు ఆయన ఈ విధంగా స్పందించారు. గోవా పర్యటనకు వచ్చిన ఇద్దరు ఢిల్లీ మహిళల్ని సోమవారం రాత్రి ఐదుగురు యువకులు బెదిరించి.. అరుణ గ్రామంలోని ఓ భవంతిలోకి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కొన్ని గంటల తర్వాత గస్తీ పోలీసు బృందం వారిని కాపాడింది. బాధితురాళ్లు ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలోనే మంత్రిగారు ఈ విధమైన కాంమెంట్లు చేయడంపై దుమారం చెలరేగింది. గోవా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి ఉర్ఫాన్ ముల్లా మంత్రి వ్యాఖ్యలపై మండిపడ్డారు. ప్రభుత్వం తీరువల్లే గోవాలో నేరాలు పెట్రేగిపోతున్నాయని విమర్శించారు. రెండేళ్ల కిందట పణాజిలో ఓ మ్యూజిక్ ఫెస్టివల్ లో మాదక ద్రవ్యాలతో పట్టుబడిన యువకుడి ఉదంతంలోనూ మంత్రిగారు ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. గోవా లాంటి పర్యాటక ప్రాంతంలో మద్యం, మాదక ద్రవ్యాలను వినియోగించడం మామూలేనని, అవి లేకుంటే టూర్ ను ఆస్వాదించలేమని, ఇందుకు నిర్వాహకులను తప్పుపట్టాల్సిన పనిలేదన్నారు. -
మ్యూజిక్ ఫెస్టివల్స్‌లో డ్రగ్స్ మామూలే: గోవా మంత్రి
పణజీ: మ్యూజిక్ ఫెస్టివల్స్ వంటి కార్యక్రమాల్లో పాల్గొనేవారు మద్యం, మాదక ద్రవ్యాలను వినియోగించడం మామూలేనని గోవా పర్యాటక మంత్రి దిలీప్ పరులేకర్ ఆదివారం అన్నారు. గోవాలో జరిగిన సన్‌బర్న్ ఫెస్టివల్లో కార్యక్రమం జరుగుతున్న చోటే శనివారం ఒక యువకుడు మాదకద్రవ్యాలతో పట్టుబడ్డాడు. మంత్రి పరులేకర్ మాట్లాడుతూ, మద్యం, మాదకద్రవ్యాలు లేకుండా మ్యూజిక్ ఫెస్టివల్స్‌ను ఆస్వాదించలేమని వాటిలో పాల్గొనేవారు భావిస్తుంటారని, ఇందుకు నిర్వాహకులను తప్పుపట్టాల్సిన పనిలేదన్నారు. -
సచిన్, కరీనా, దీపికా.. ఎవరూ మాకు అక్కర్లేదు
సచిన్ టెండూల్కర్, దీపికా పదుకొనే, కరీనా కపూర్, సైఫ్ అలీఖాన్.. వీళ్లంతా గోవాకు తాము బ్రాండ్ అంబాసిడర్లుగా ఉంటామంటూ క్యూలు కడుతున్నారు. కానీ, గోవా మాత్రం అసలు తమ రాష్ట్రాన్ని ప్రమోట్ చేసుకోడానికి వీళ్లెవరూ అక్కర్లేదని తెగేసి చెబుతోంది. ఇదే విషయాన్ని ఆ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి దిలీప్ పరులేకర్ విలేకరులతో చెప్పారు. గోవా దానంతట అదే ఓ పెద్ద సెలబ్రిటీ అని, ఇక ప్రచారం కోసం తారల వెంట పడాల్సిన అవసరం తమ రాష్ట్రానికి లేదని ఆయన అన్నారు. మార్కెటింగ్ ఏజెన్సీల నుంచి తమకు ప్రతిపాదనలు వచ్చాయని, దీపికా పదుకొనే, సచిన్ టెండూల్కర్, కరీనా కపూర్- సైఫ్ అలీఖాన్ జంట.. వీళ్లంతా గోవాకు బ్రాండ్ అంబాసిడర్లుగా ఉండేందుకు సిద్ధపడ్డారని ఆయన తెలిపారు. కానీ రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రం ఈ సెలబ్రిటీలు ఎవరితోనూ ఒప్పందాలు చేసుకునే ఆలోచన లేదని పరులేకర్ అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులు గోవాను భారత్‌లో తమ ప్రథమ ప్రాధాన్యంగా ఎంచుకుంటారని ఆయన తెలిపారు. రెండేళ్ల క్రితం మాత్రం నటి ప్రాచీ దేశాయ్‌ని గోవా ఒకసారి బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకుంది.