Dilpreet Singh
-
హాకీలో ఘోరంగా...
ఓ రోజు ముందు మహిళల జట్టు కనబరిచిన పేలవమైన ప్రదర్శనను మరుసటి రోజు పురుషుల జట్టూ మన కళ్లముందుంచింది. పూల్ ‘ఎ’లో ఆదివారం జరిగిన రెండో లీగ్‌లో భారత జట్టు 1–7తో ప్రపంచ నంబర్‌వన్ ఆస్ట్రేలియా చేతిలో పరాభవం చవిచూసింది. మన్‌ప్రీత్ బృందం అన్ని రంగాల్లో విఫలమైంది. డిఫెండర్లు ప్రత్యర్థి జోరును అడ్డుకోలేకపోయారు. మన మిడ్‌ఫీల్డర్లు ప్రత్యర్థి గోల్‌పోస్ట్‌ను ఛేదించలేకపోయారు. భారత్ తరఫున ఏకైక గోల్‌ను దిల్‌ప్రీత్ సింగ్ (34వ ని.లో) చేశాడు. ఆసీస్ శిబిరంలో బ్లేక్ గోవర్స్ (40వ, 42వ ని.) రెండు గోల్స్ చేయగా, డానియెల్ (10వ ని.), హేవర్డ్ (21వ ని.), అండ్రూ ఫ్లిన్ (23వ ని.), బెల్జ్ (26వ ని.), టిమ్ బ్రాండ్ (51వ ని.) తలా ఒక గోల్ చేశారు. -
ముగ్గురు భారత ఆటగాళ్ల హ్యా'ట్రిక్' ఫీట్
⇒ ఒమన్ పై భారత్ ఘనవిజయం భారత హాకీ యువజట్టు సంచలన ఆటతీరుతో ఆకట్టుకుంది. బంగ్లాదేశ్ రాజధాని ఢాకా వేదికగా జరిగిన అండర్-18 ఆసియా కప్ లో భాగంగా జరిగిన నాకౌట్ మ్యాచ్ లో భారత ఆటగాళ్లు గోల్స్ వర్షం కురిపించారు. దీంతో ఒమన్ పై 11-0 గోల్స్ తేడాతో భారత్ విజయకేతనం ఎగురవేసింది. ఆల్ రౌండ్ ప్రదర్శన చేసిన దిల్ ప్రీత్ సింగ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు సొంతం చేసుకున్నాడు. రికార్డు స్థాయిలో ఈ మ్యాచ్ లో ముగ్గురు భారత ఆటగాళ్లు హ్యాట్రిక్ గోల్స్ సాధించడం విశేషం. కెప్టెన్ నీలమ్ సంజీప్ (8, 15, 52), కొంజెంగ్ బామ్ సింగ్(30, 40, 62), దిల్‌ప్రీత్ సింగ్ (34, 53, 68) నిమిషాలలో గోల్స్ చేయగా... అభిషేక్, శివం ఆనంద్ చెరో గోల్ చేయడంతో భారత్ ఏకంగా 11 గోల్స్ తమ ఖాతాలో వేసుకుంది. అయితే ప్రత్యర్థి ఒమన్ జట్టు కనీసం ఖాతా తెరవలేకపోయింది.