వృద్ధురాలిని బంధించి నగలు, నగదు దోపిడీ
హైదరాబాద్: మెహిదీపట్నం ప్రాంతంలోని పీవీ ఎక్స్‌ప్రెస్ వే పిల్లర్ నెంబర్ 35 వద్దనున్న దిల్షాద్ నగర్లో దోపిడీ జరిగింది. ఆ ప్రాంతంలోని గులాం ముస్తఫా ఇంటికి వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు వృద్ధురాలు అయిన ఆయన భార్య స్వకత్ ఫాతిమాను బంధించారు. ఇంట్లో ఉన్న 6 తులాల బంగారు ఆభరణాలు, రూ.2000 నగదు ఎత్తుకెళ్లారు.
కుటుంబ సభ్యుల నుంచి చోరీ సమాచారం తెలుసుకున్న అసిఫ్‌నగర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. సీసీ కెమెరా ఫుటేజీలు పరిశీలిస్తున్నారు. టాస్క్ఫోర్సు డీసీపీ లింబారెడ్డి ఆధ్వర్యంలో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.