హ్యారీపోటర్ గుర్తొస్తున్నాడు! - కె.విశ్వనాథ్
వైవిధ్యమైన కథతో యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న చిత్రం ‘ప్లేయర్’. జ్ఞాన్‌సాగర్ దర్శకత్వంలో పర్వీన్‌రాజ్ హీరోగా యమున కిషోర్, జగదీశ్ కుమార్ కల్లూరి నిర్మిస్తున్న ఈ చిత్రం ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సీనియర్ దర్శకుడు కె.విశ్వనాథ్ మాట్లాడుతూ-‘‘ పర్వీన్‌ను చూస్తోంటే హ్యారీపోటర్ గుర్తొస్తున్నాడు.
నేను పర్వీన్‌తో ఓ యాడ్‌లో చేశాను. తను బాగా నటిస్తాడు’’ అని చెప్పారు. ‘‘పర్వీన్‌ను ఓ యాడ్‌లో చూడగానే నచ్చి వెంటనే ఈ సినిమా కోసం సెలెక్ట్ చేశాం. ఇన్నోవేటివ్, థ్రిల్లర్ స్టోరీ. సురేశ్ సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికే హైలైట్. కచ్చితంగా అందరికీ నచ్చే సినిమా ఇది’’అని నిర్మాతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సినిమాటోగ్రాఫర్ చోటా కె నాయుడు, నిర్మాత సురేశ్ కొండేటి తదితరులు పాల్గొన్నారు.