బిజీ షెడ్యూల్ మధ్య.. లఘు చిత్రంలో...
మొదట్లో తెలుగులో బిజీ బిజీగా సినిమాలు చేసిన సిద్ధార్థ్ ఇప్పుడు మాత్రం తమిళ చిత్రాలకే పచ్చజెండా ఊపుతున్నారు. తమిళంలో ఈ ఏడాది ఆయన చేసిన ‘జిగర్తండా’ ఘనవిజయం సాధించింది. మరో రెండు చిత్రాలతో బిజీగా ఉన్న సిద్ధార్థ్ తాజాగా ఓ లఘు చిత్రంలో నటించడానికి అంగీకరించారు. ‘పిజ్జా’, ‘జిగర్ తండా’ చిత్రాల దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ ఈ లఘు చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. సిద్ధు నటించిన ‘జిగర్తండా’కి ఈయనే దర్శకుడు.
స్వతహాగా సాఫ్ట్వేర్ ఇంజినీర్ అయిన కార్తీక్కి సినిమాలంటే చాలా ఇష్టం. ఆ ఇష్టంతోనే గతంలో పలు లఘు చిత్రాలకు దర్శకత్వం వహించారు. అవే ఆయన్ను సినిమా దర్శకుణ్ణి చేశాయి. అందుకే ఇప్పుడు లఘు చిత్రాలు తీసి, థియేటర్లలో విడుదల చేయాలనుకుంటున్నారు.