అది మీలో నిజాయితీ లేకుండా చేస్తుంది!
న్యూయార్క్: మీలో సృజనాత్మకత ఎక్కువగా ఉందని భావిస్తున్నారా? అయితే, దాని వెనుకే అసంతృప్తిని కలిగించే అంశం కూడా ఉందని ఓ అధ్యయనం చెబుతోంది. క్రియేటివిటీ ఎక్కువగా ఉన్న వ్యక్తుల్లో నిజాయితీ లోపిస్తుందని, ఆ కళే నిజాయితీ లేకుండా ఉండేలా ఒక వ్యక్తిని తయారు చేస్తుందని సిరాకస్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్, రీసెర్చర్ లిన్నే విన్సెంట్ తెలిపారు.
ఈ అధ్యయనం ప్రకారం ఒక వ్యక్తి అత్యంత అరుదుగా ఉండే విలువైన క్రియేటివిటీ తనకు మాత్రమే ఉందని ఎప్పుడు భావిస్తాడో అతడిలో అవసరం లేని ఆలోచనలు చుట్టుముడతాయి, అవే తనలో నిజాయితీ పరిమాణాన్ని కొంచెంకొంచెం తగ్గిస్తాయి. ఎలాగో తనకు సృజనాత్మకత సృష్టి శక్తి ఉందనే భావనలో ప్రాక్టికల్‌గా చేయాల్సిన అంశాలు కూడా నిర్లక్ష్యం చేస్తారని, వాటి గురించి ప్రశ్నలు తలెత్తినప్పుడు ఏదో ఒకటి చెప్పి తప్పించుకునే యత్నంలో పడి నిజాయితీలేని వ్యక్తులుగా మిగిలిపోతారని అధ్యయనం వెల్లడించింది.