ఇందిరమ్మకు నివాళి
వరంగల్ : మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి అన్నారు. జిల్లా, నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ 97వ జయంతి వేడుకలను హన్మకొండలోని డీసీసీ భవన్లో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఇందిర చిత్రపటానికి కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి, నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా కార్యకర్తలనుద్దేశించి రాజేందర్‌రెడ్డి మాట్లాడారు.
ఇందిరాగాంధీ తన తండ్రి నెహ్రూ అడుగు జాడల్లో పయనిస్తూ దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారని అన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి జీవితాన్ని అంకితం చేశారని కొనియాడారు. సమావేశంలో పార్టీ నగర అధ్యక్షుడు తాడిశెట్టి విద్యాసాగర్, మాజీ మంత్రి బస్వరాజు సారయ్య, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, మాజీ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి, మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ మాట్లాడారు.
కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్, డీసీసీబీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, టీపీసీసీ కార్యదర్శులు డాక్టర్ హరిరమాదేవి, బొద్దిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, కోన శ్రీకర్, కట్ల శ్రీనివాస్, టీపీసీసీ మీడియా కన్వీనర్ ఈవీ శ్రీనివాసరావు, జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధులు జి.అమృతరావు, నమిండ్ల శ్రీనివాస్, నాయకులు రావుల నర్సింహారెడ్డి, పోశాల పద్మ, బిన్ని లక్ష్మణ్, తాడిశెట్టి మధు, బాసాని వెంకటేశ్వర్లు, సురేందర్, రమేష్, మానుపాటి శ్రీనివాస్, సత్యం, సీతశ్యాం, ధనరాజ్, సేవాదళ్ అశోక్, అసోద రాజయ్య, బుచ్చిరెడ్డి, రవీందర్‌రెడ్డి, యాదగిరి, మాజీ కార్పొరేటర్లు నెక్కొండ కిషన్, గొట్టిముక్కుల రమణారెడ్డి, నాగరాజు, రావుల సదానందం, నసీంజా, వీరన్న, రాజు పాల్గొన్నారు.
యువత పాత్ర కీలకం : కలెక్టర్
హన్మకొండ అర్బన్ : దేశాభివృద్ధిలో యువత కీలక పాత్ర పోషించాలని కలెక్టర్ జి.కిషన్ అన్నారు. జాతీయ సమైక్యతా వారోత్సవాలను కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో బుధవారం ప్రారంభించారు. యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వారోత్సవాల్లో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాల వేసి, నివాళులర్పించారు. అనంత రం సెట్వార్ సీఈఓ పురుషోత్తం అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడారు. యువత సేవా దృక్పథంతో పనిచేసే విధానం అలవర్చుకోవాలని అన్నారు.
అనంతరం జాతీ య సమైక్యతపై అందరితో ప్రతిజ్ఞ చేయించా రు. ఈనెల 19 నుంచి 25 వరకు జాతీయ సమైక్యతా వారోత్సవాలు నిర్వహిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. అలాగే వ్యక్తిత్వ, వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు కలెక్టర్ బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో డీఆర్వో సురేంద్రకరణ్, నెహ్రూ యువకేంద్రం కోఆర్డినేటర్ మనోరంజన్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం జిల్లా యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు పోటీ పరీక్షలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.