జిల్లా సమస్యలపై దృష్టి
శ్రీకాకుళo : కల్చరల్: జిల్లాలోని క్రైస్తవుల సమస్యలపై దృష్టి సారిస్తానని క్రిస్టియన్ నామినేటెడ్ ఎమ్మెల్యే ఫిలిప్ సి.టోచర్ అన్నారు. స్థానిక చిన్నబజారులోని తెలుసు బాప్టిస్టు చర్చిలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లా లో సమస్యలను అధ్యయనం చేసేందుకే వచ్చానని చెప్పారు. క్రైస్తవులకు శ్మశాన వాటికల విషయంలో రెవెన్యూ అధికారులతో చర్చిస్తానని చెప్పారు. స్థలాలు జారీ చేయాలని 1998లోనే అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినా అవి అమలు కాలేదని అన్నారు.
జిల్లాలో 150 శ్మశాన వాటికలు ఉన్నాయని, వాటికోసం స్థలం కేటాయించేలా కృషి చేస్తామన్నారు. కులధ్రువీకరణ పత్రాల మం జూరులోనూ అడ్డంకులు ఉన్నాయని, వాటినీ పరిష్కరిస్తామని తెలిపారు. క్రైస్తవుల సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లామని అన్నారు. సమావేశంలో జిల్లా స్థాయి మైనారిటీ ఇంప్లిమెం టేషన్ కమిటీ సభ్యులు రెవ. పి.కృపానందం, బోసుబాబు, సుజ్నానరావు, సద్గుణరావు, ఆశీ ర్వాదం, జాకబ్, జె.కృపానందం తదితరులు పాల్గొన్నారు.