District Planning Committee (DPC) election
-
ప్రణాళికాబద్ధంగా పంపకాలు
ముగిసిన డీపీసీ ఎన్నికల ప్రక్రియ ⇒ గ్రామీణ స్థానాలు ఏకగ్రీవం ⇒పట్టణ సీట్లకు తప్పని పోటీ ⇒మూడు స్థానాలకు ఓటింగ్ ⇒విజేతలను ప్రకటించిన సీఈఓ సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: జిల్లా ప్రణాళిక కమిటీ(డీపీసీ) సభ్యుల ఎన్నికల క్రతువు ముగిసింది. పార్టీల పరస్పర అంగీకారంతో గ్రామీణ స్థానాలు(జిల్లా పరిషత్) ఏకగ్రీవం కాగా, మూడు పట్టణ స్థానాలకు బుధవారం ఎన్నికలు జరిగాయి. జిల్లా పరిషత్‌లో ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగగా, ఆ తర్వాత ఓట్లను లెక్కించారు. మూడు సీట్లకు ఐదుగురు బరిలో ఉండడంతో మొదటి వరుసలో నిలిచిన ముగ్గురిని విజేతలుగా ప్రకటించారు. జిల్లాలోని బడంగ్‌పేట, తాండూరు, వికారాబాద్ , పెద్దఅంబర్‌పేట, ఇబ్రహీంపట్నం నగర పంచాయతీలకు చెందిన 119 మంది కౌన్సిలర్లు ఓట్లు వేయాల్సివుండగా, 18 మంది గైర్హాజరయ్యారు. వీరిలో అధికంగా 15 మంది వికారాబాద్ మున్సిపాలిటీ కౌన్సిలర్లు ఉన్నారు. ‘మంత్రా’ంగం! తొలిసారి డీపీసీ స్థానాలకు ఎన్నికలను ప్రకటించడంతో జిల్లా మంత్రి మహేందర్‌రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరించారు. అన్ని పార్టీల నాయకత్వంతో చర్చించి రాజీమార్గాన్ని పాటించారు. ఈ మేరకు సీట్ల సర్దుబాటు జరిగింది. ఈ క్రమంలోనే జిల్లా పరిషత్(గ్రామీణ) స్థానాల(10) ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. అయితే, పట్టణ నియోజకవర్గాల స్థానాల(14) విషయంలో టీడీపీ, బీజేపీల మధ్య అవగాహన కుదరకపోవడంతో ఎన్నికలు అనివార్యమయ్యాయి. మూడు బీసీ(జనరల్) స్థానాలకు ఐదుగురు పోటీలో ఉండడంతో పోలింగ్ తప్పనిసరైంది. ఆ తర్వాత ఓట్ల లెక్కింపు ఆనంతరం సీఈఓ చక్రధర్‌రావు ముగ్గురు విజేతలను ప్రకటించారు. డీపీసీ సభ్యులు వీరే..! గ్రామీణ నియోజకవర్గం: పోలమెళ్ల బాలేష్, జే.కే.శైలజ, పి.సరోజ, కర్నాటి రమేశ్‌గౌడ్, పట్లోళ రాములు, ముచ్చోతు మంజుల, ఎనుగుల జంగారెడ్డి, మంద సంజీవరెడ్డి, చింపుల శైలజ, ముంగి జ్యోతి. పట్టణ నియోజకవర్గం: పి. స్వప్న, ఆకుల యాదగిరి, పి.నర్సిములు, యాతం శ్రీశైలంయాదవ్, పూడూరి దమయంతి, బి.సునీత, ఈరంకి వేణుకుమార్‌గౌడ్, పెద్దబావి శ్రీనివాస్‌రెడ్డి, విజయేందర్‌గౌడ్, వినోద్‌కుమార్‌జైన్, అంజలి, అమరావతి, చామ సంపూర్ణరెడ్డి, దేవిడి స్వప్న. -
డీపీసీకి 29 నామినేషన్లు
ఆదిలాబాద్ అర్బన్ : జిల్లా ప్రణాళిక కమిటీ (డీపీసీ) ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. కలెక్టర్ ఎం.జగన్మోహన్ శుక్రవారం జిల్లా పరిషత్ కార్యాలయంలో సభ్యుల నుంచి వచ్చిన నామినేషన్లను స్వీకరించారు. 24 స్థానాలకు గాను 20 స్థానాలు జెడ్పీటీసీలకు, నాలుగు స్థానాలు మున్సిపల్ కౌన్సిలర్లకు కేటాయించిన విషయం తెలిసిందే. రూరల్ నియోజకవర్గంలోని 20 స్థానాలకు గాను 23 నామినేషన్లు దాఖలయ్యాయి. అర్బన్ నియోజకవర్గంలోని 4 స్థానాలకు గాను 6 నామినేషన్లు వచ్చాయి. నామినేషన్ల స్వీకరణకు సంబంధించిన ప్రత్యేక కౌంటర్‌ను ఏర్పాటు చేశారు. జిల్లా పరిషత్ సీఈవో అనితాగ్రేస్, జిల్లా పరిషత్ కార్యాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. నామినేషన్లు ఇలా.. ఎన్నికలు జరిగే స్థానాలకు రిజర్వేషన్ల వారీగా నామినేషన్లు వచ్చాయి. రెండు మహిళా ఎస్సీ స్థానాలకు గాను 2 నామినేషన్లు, రెండు జనరల్ ఎస్సీ స్థానాలకు రెండు నామినేషన్లు, రెండు ఎస్టీ మహిళా స్థానాలకు 2 నామినేషన్లు, రెండు ఎస్టీ జనరల్ స్థానాలకు 2 నామినేషన్లు, మూడు బీసీ జనరల్ స్థానాలకు 4 నామినేషన్లు, నాలుగు బీసీ మహిళా స్థానాలకు 5 నామినేషన్లు, మూడు అన్‌రిజర్వుడ్ జనరల్ స్థానాలకు 4 నామినేషన్లు, రెండు అన్‌రిజర్వుడ్ మహిళా స్థానాలకు 2 నామినేషన్ల చొప్పు న మొత్తం 23 నామినేషన్లు దాఖలయ్యాయి. పట్టణ నియోజకవర్గంలోని 4 స్థానాలకు 6 నామినేషన్లు వచ్చాయి. ఎస్సీ మహిళా స్థానానికి ఒక నామినేషన్, బీసీ జనరల్ స్థానానికి రెండు నామినేషన్లు, అన్‌రిజర్వుడ్ జనర ల్ స్థానానికి రెండు నామినేషన్లు, అన్‌రిజర్వుడ్ మహిళా స్థానానికి ఒక నామినేషన్ చొప్పున మొత్తం పట్టణ నియోజకవర్గానికి 6 నామినేషన్లు దాఖలయ్యాయి. 17న ఎన్నికలు.. ఈనెల 15న డీపీసీకి వచ్చిన నామినేషన్లను పరిశీలి స్తారు. అదేరోజు జాబితాను ప్రకటిస్తారు. 16న నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. సాయంత్రం బరి లో ఉన్న అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు. 17న జిల్లా ప్రణాళిక కమిటీ ఎన్నికలు నిర్వహిస్తారు. జిల్లా పరిషత్ కార్యాలయంలో ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ ఎన్నిక జరగనుంది. అనంతరం ఓట్లను లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు.