పోస్టల్ సూపరింటెండెంట్‌గా శ్రీనివాసరావు
కడప వైఎస్ఆర్ సర్కిల్ :
జిల్లా పోస్టల్ కార్యాలయ సూపరింటెండెంట్‌గా ఎ.శ్రీనివాసరావు గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈయన అనంతపురంలో పని చేస్తూ బదిలీపై కడపకు వచ్చారు. ఇక్కడ పని చేస్తున్న శ్రీనివాసమూర్తి తిరుపతికి బదిలీ అయ్యారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన పోస్టల్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు మాట్లాడుతూ జిల్లాలో పోస్టల్ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. ఇటీవల కేంద్రం ప్రవేశ పెట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తామన్నారు. బాధ్యతలు స్వీకరించిన ఈయనకు పోస్టల్ సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.