రాష్ట్రస్థాయి ఫెన్సింగ్ పోటీలకు జిల్లాజట్ల ఎంపిక
రాజోలు :
రాష్ట్రస్థాయి ఫెన్సింగ్ (కత్తిసాము) పోటీలకు అండర్–19 క్రీడాకారుల ఎంపిక సోమవారం ముగిసింది. రాజోలులోని యూత్‌క్లబ్ ఆవరణలో జిల్లాస్థాయిలో నిర్వహించిన పోటీలను సీనియర్ న్యాయవా ది కె.పి.ఆర్.నాయుడు ప్రారంభించారు. రాష్ట్ర ఫెన్సింగ్ అసోసియేష¯ŒS అధ్యక్షుడు ముదునూరి అక్కిరాజు, సభ్యులు పుట్టా రామకృష్ణ, సిహెచ్.జి.వి.ఎస్.ప్రసాద్‌ల ఆధ్వర్యంలో ఎంపిక జరిగింది. రాష్ట్రస్థాయిలో ఎంపికైన క్రీడాకారులు మంగళ, బుధవారాల్లో అనంతపురంలో జరిగే రాష్ట్రస్థా యి పోటీల్లో పాల్గొంటారు. బాలికల విభాగంలో అడబాల రాఘవి, కొ క్కిరగడ్డ చాందిని శ్రీ పూర్ణిమ, సయ్యద్ నజ్రీన్, కోన రేనా ఏవాంజిల్, యడ్ల సోనీలయ, తాడి మనోజ్ఞ, కొడవటి రుక్మిణి సాయి దుర్గ, కొక్కిరగడ్డ శరణ్య ఎంపిక కాగా, బాలుర విభాగంలో కోట హేమంత్, మంద అవినాష్, కె.స్వామియోగేంద్ర, మామిడిశెట్టి బాల వెంకట లక్ష్మినరసింహసాయి, వి.మసే¯ŒSరాజు, కొడవటి రాజగోపాల్‌నాయుడు, గురుజుల గణేష్, కోన సామ్యూల్‌రాజు, చెల్లింగి రవీంద్ర ఎంపికయ్యారు. పీఈటీలు కె.నాగరాజు, బళ్ల శ్రీను, ఎం.శ్రీధర్, పి.రామకృష్ణ పర్యవేక్షించారు.