ములుగు బంద్ సంపూర్ణం
ములుగు : ములుగులోని డివిజన్ కార్యాలయాలను భూపాలపల్లికి తరలించే ప్రయత్నాలు మానుకోవాలని, సమ్మక్క–సారలమ్మ జిల్లాగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం, జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన బంద్ సంపూర్ణంగా జరిగింది. వ్యాపారులతోపాటు ప్రైవేటు పాఠశాలలు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొన్నాయి. అఖిలపక్ష నాయకులు జాతీయరహదారిపై టైర్లు కాల్చి నిరసన తెలిపారు. అనంతరం గేదెకు వినతిపత్రం అందించారు. రహదారిపై రాస్తారోకో, ధర్నా చేపట్టగా కిలోమీటర్ మేర వాహనాలు నిలిచాయి. ఎస్సై మల్లేశ్‌యాదవ్ సిబ్బందితో చేరుకొని ఆందోళన విరమింపజేశారు. ఈ సందర్భంగా అఖిలపక్షం అధ్యక్షుడు నల్లెల్ల కుమార్, జిల్లా సాధన సమితి అధ్యక్షుడు ముంజాల బిక్షపతిగౌడ్ మాట్లాడారు.
ఓవైపు ప్రజాభిప్రాయాలు, అభ్యంతరాల సేకరణ కొనసాగుతుండగానే కొన్నేళ్లుగా ములుగులో ఉన్న డివిజన్ కార్యాలయాలను భూపాలపల్లికి తరలించడం సరికాదన్నారు. ములుగు ప్రజల ఆకాంక్ష నెరవేర్చలేని మంత్రి చందూలాల్ వెంటనే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 21వ తేదీ వరకు నిత్యం పలు రకాలుగా ఉద్యమాలు నిర్వహిస్తూనే ఉంటామన్నారు. కార్యక్రమంలో వెంకటాపురం జడ్పీటీసీ సభ్యురాలు బానోతు విజయ, ఎంపీపీ దేవరనేని స్వామిరావు, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మస్రగాని వినయ్‌కుమార్, బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ చింతలపూడి భాస్కర్‌రెడ్డి, టీడీపీ మండల అధ్యక్షుడు పల్లె జయపాల్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అ««దl్యక్షుడు వేముల బిక్షపతి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గొల్లపల్లి రాజేందర్‌గౌడ్, బీజేపీ మండల అధ్యక్షుడు బాణాల రాజు, జిల్లా సాధన సమితి ప్రధానకార్యదర్శి నూనె శ్రీనివాస్, నాయకులు ఎండి.యూనుస్, కోగిల రాంబాబు, దూడబోయిన శ్రీనివాస్, మహేందర్, సిరికొండ బలరాం, రవీంద్రాచారి పాల్గొన్నారు.