పోలీస్ అధికారులకు స్ట్రెస్ థెరపీ: ఎస్పీ
కోలారు: విధి నిర్వహణలో పోలీసు అధికారులు ఒత్తిడిని అదిగమించేందుకు స్ట్రెస్ థెరఫీ ఇప్పించేందుకు ప్రయత్నిస్తున్నట్లు జిల్లా ఎస్పీ దివ్య వీ గోపినాథ్ తెలిపారు. బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. మాలూరు సీఐ రాఘవేంద్రన్ అనుమానాస్పద మృతి కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
రాఘవేంద్రన్ విధి నిర్వహణలో ఒత్తిడికి గురయ్యారా ? అని విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానం ఇస్తూ.. ఒత్తిడికి గురయ్యారా లేక ఆత్మహత్యకు ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే అంశంపై కూలంకుషంగా దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.