డీజే రిపోర్ట్ : తొలి వారం వంద కోట్లు
నెగెటివ్ టాక్ తో కూడా రికార్డ్ సృష్టించటం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి అలవాటుగా మారిపోయింది. ఇటీవల బన్నీ హీరోగా తెరకెక్కిన సినిమాలన్నీ డివైడ్ టాక్ తోనే మొదలయ్యాయి. ఎక్కువగా కమర్షియల్ సినిమాలు మాత్రమే చేస్తున్న బన్నీ, ప్రతి సినిమాకు డివైడ్ టాక్ వస్తోంది. కానీ కలెక్షన్ల విషయంలో బన్నీ సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాడు. గత శుక్రవారం రిలీజ్ అయిన డీజే దువ్వాడ జగన్నాథమ్ కూడా డివైడ్ టాక్ తో మొదలైన కలెక్షన్ల సునామీ సృష్టించింది.
తొలి వారంలోనే ఏకంగా వంద కోట్ల గ్రాస్ వసూలు చేసి డీజే రికార్డ్ సృష్టించాడు. ఈ సినిమా రెండో వారంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్లలో ఒక వారంలో 100 కోట్ల గ్రాస్ సాధించినట్టుగా చిత్రయూనిట్ అఫిషియల్ గా ప్రకటించారు. అంతేకాదు దర్శకుడు హరీష్ శంకర్ అభిమానులకు సోషల్ మీడియా ద్వారా కృతజ్ఞతలు తెలిపాడు. 'వంద కోట్ల సినిమా ఇచ్చిన సభ్య సమాజానికి శతకోటి వందనాలు, కలెక్షన్ల పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తా'మని ట్వీట్ చేశాడు.
Vanda kotla cinema ichina Sabhya samaajaanaki Shata koti vandanaalu.. Detailed fugures will be announced soon pic.twitter.com/6ghIage8mE
— Harish Shankar .S (@harish2you) 30 June 2017