భయపెట్టి పాలించలేరు
గద్వాల/న్యూటౌన్, న్యూస్‌లైన్: అక్రమ కేసులతో ఇరికించి ఇబ్బం దులకు గురిచేస్తూ ప్రజలందరినీ గుప్పి ట్లో పెట్టుకొని పాలన చేయాలని చూడ టం సరికాదని, తన భార్య మంత్రి కావడంతో డీకే భరతసింహారెడ్డి చేస్తున్న దుష్టపాలన పోయే రోజులు ఇక ఎన్నోరోజులు లేవని వైఎస్ఆర్ సీపీ గద్వాల సమన్వయకర్త కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. వ్యాపారాలను కబ్జా చేసుకుని పోటీకి వచ్చే వ్యక్తులపై అక్రమకేసులు బనాయిస్తూ అనగదొక్కేందుకు ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. జిల్లాలో భరతసింహారెడ్డి అక్రమాలకు అడ్డూఅదుపు లేకుండా పోతుందన్నారు. ఇటిక్యాల మాజీ ఎంపీపీ ఖగనాథ్రెడ్డిపై భరతసింహారెడ్డి అక్రమంగా కేసులు బనాయించడాన్ని నిరసిస్తూ శనివారం స్థానిక ఆర్డీఓ కార్యాలయం ఎదుట వైఎస్ఆర్ సీపీ, టీఆర్ఎస్, ఇతర ప్రజాసంఘాల ఆధ్వర్యంలో భారీధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా కృష్ణమోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగులు సైతం భరతసింహారెడ్డి చేస్తున్న అక్రమాలను చూస్తూ ఉండటం పట్ల ఏమీ చేయలేకపోతున్నారని అన్నారు. గద్వాలకు డీఎస్పీగా ఒక మహిళాను నియమిస్తే ఎర్రవల్లి చౌరస్తా నుంచి గద్వాలకు రాకుండానే పంపేసిన చరిత్ర గద్వాల మంత్రిది అన్నారు. భరతసింహారెడ్డి కేవలం సంపాదన కోసమే ప్రయత్నిస్తున్నారు తప్ప ప్రజల క్షేమం కోసం కాదన్నారు. ఇటిక్యాల మాజీ ఎంపీపీ ఖగనాథ్‌రెడ్డి క్రషింగ్ యూనిట్‌ను పెట్టారన్న ఈర్ష్యతోనే అతనిపై భరతసింహారెడ్డి బనాయించారని ఆరోపించారు. ఇకనైనా అక్రమకేసును ఉపసంహరించుకోవాలని కృష్ణమోహన్‌రెడ్డి సూచించారు.
వేధించడమే వారికి తెలుసు:
గట్టు తిమ్మప్ప
టీఆర్ఎస్ నేత, డీసీసీబీ మాజీ చైర్మన్ గట్టు తిమ్మప్ప మాట్లాడుతూ.. తప్పు పట్టేందుకు ప్రయత్నించే వ్యక్తులను గుర్తించి మరీ అనగదొక్కేందుకు డీకే కుటుంబం ప్రయత్నించడం నాటి నుంచి నేటి వరకు జరుగుతుందన్నారు. గట్టు భీముడు కుటుంబం ఎదుగుతుందన్న అక్కస్సుతోనే ఎన్నో కేసులు పెట్టించారన్నారు. అయినా తాము భయపడలేదన్నారు. ఎంత వేధిస్తే అంతపైకి వచ్చేలా ప్రయత్నించామన్నారు. ప్రజలంతా ఏకమైతే డీకే కుటుంబ పాలన ఎన్నాళ్లూ ఉండదన్న వాస్తవాన్ని గమనించాలన్నారు. అందరు ఒక్కటై ఎదురుతిరిగితేనే డీకే కుటుంబ పాలనకు తెరపడుతుందన్నారు. అనంతరం ఆర్డీఓ నారాయణరెడ్డికి వినతి పత్రం సమర్పించారు. ఈ ధర్నాలో టీఆర్ఎస్ నాయకులు గంప గోవర్ధన్, టీఆర్ఎస్వీ నాయకులు మోనేష్, టీజేఏసీ నాయకులు భీమేశ్వర్రెడ్డి, డీటీఎఫ్ నాయకులు ప్రభాకర్, షేక్‌పల్లి సర్పంచ్ రవీందర్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీ సభ్యుడు నారాయణ, సర్పంచ్ జయరామయ్య, సర్పంచ్ల సంఘం అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి, నాయకులు భీంసేన్‌రెడ్డి, లోకారెడ్డి, తిమ్మారెడ్డి, నాగబలిమి, మాణిక్యరెడ్డి, బలరాముడు తదితరులు ప్రసంగించారు.