చిట్ ఫండ్ పేరుతో టీడీపీ నేత కోటి రూపాయల కుచ్చుటోపి
ఖమ్మం: చిట్టిల పేరుతో టీడీపీ నేత జనాన్ని మోసం చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. సంఘమిత్ర చిట్ఫండ్ పేరుతో ఖమ్మం జిల్లా వైరాలో టీడీపీ నేత దేవబత్తిని నాగేశ్వరరావు జనానికి కుచ్చుటోపి పెట్టారు. సుమారు కోటి రూపాయల మేరకు కుచ్చుటోపి పెట్టినట్టు తెలుస్తోంది.
మోసానికి గురైన ఇన్వెస్టర్ల ఫిర్యాదు మేరకు టీడీపీ నేత దేవబత్తిని నాగేశ్వరరావుపై చీటింగ్ కేసు నమోదు చేశారు. ఫిర్యాదుదారుల నుంచి పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. చీటింగ్ పాల్పడినట్టు సమాచారం బయటకు పొక్కడం పెద్ద ఎత్తున్న ఖాతాదారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.