టీడీపీ ఎమ్మెల్యేపై మరో రెండు కేసులు
కైకలూరు, న్యూస్‌లైన్: కృష్ణాజిల్లా కైకలూరు టీడీపీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణపై బుధవారం మరో రెండు కేసులు నమోదయ్యాయి. భార్య సునీత ఫిర్యాదు మేరకు కైకలూరు పోలీసులు ఆయనపై తొలుత గృహహింస చట్టం-498 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. విషయం న్యాయస్థానానికి వెళ్లిన తర్వాత మరో రెండు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. హత్యాయత్నానికి ప్రయత్నించారనే ఆరోపణపై 307, బలవంతంగా సంతకాలు తీసుకున్నారనే ఆరోపణపై 384 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. మచిలీపట్నంలో అడిషనల్ ఎస్పీ షెముషి బాజ్‌పాయ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే దంపతులకు బుధవారం నిర్వహించాల్సిన కౌన్సెలింగ్ ఈ నెల 30కి వాయిదా పడింది.