పదవీకాలంలో జీతమంతా విరాళంగా ఇచ్చారు
న్యూఢిల్లీ: హరియాణాకు చెందిన రాజ్యసభ సభ్యుడు, మీడియా టైకూన్ డాక్టర్ సుభాష్ చంద్ర.. ఎంపీగా తన పదవీకాలంలో తీసుకునే మొత్తం జీతాన్ని ప్రధాన మంత్రి సహాయ నిధికి విరాళంగా ప్రకటించారు. తాను నెలకు ఒక్క రూపాయి మాత్రమే జీతం తీసుకుంటానని, మిగిలిన మొత్తాన్ని ప్రధాని సహాయ నిధికి అందజేస్తానని చెప్పారు. సుభాష్ చంద్ర.. ప్రధాని నరేంద్ర మోదీని కలిసి చెక్ అందజేశారు.
హరియాణాలోని హిసార్‌లో జన్మించిన సుభాష్ చంద్ర తన 20వ ఏట 17 రూపాయలతో ఢిల్లీకి వచ్చారు. మీడియా రంగంలోకి వచ్చి అంచెలంచెలుగా ఎదిగారు. భారత టెలివిజన్ రంగంలో తొలిసారిగా 1992లో ఉపగ్రహ టీవీ చానెల్ జీ టీవీని ప్రారంభించారు. ఆ తర్వాత తొలి ప్రైవేట్ న్యూస్ చానెల్ జీ న్యూస్‌ను స్థాపించారు.