స్కోడా కారును గాడిదలతో లాగించి..
లుథియానా: ఏదైనా వస్తువులు అమ్మేటప్పుడు కంపెనీలు అన్ని సర్వీసులు అందిస్తామని వినియోగదారులకు హామీయిస్తుంటాయి. తీరా ఏదైనా సమస్య వచ్చినప్పడు తమకు సంబంధం లేదన్నట్టుగా చాలా కంపెనీలు వ్యవహరిస్తుంటాయి. ఇలాంటి సమయాల్లో వినియోగదారులు సదరు సంస్థలతో గొడవలకు దిగడం, తిట్టిపోయడం జరుగుతుంటుంది. చైతన్యవంతులైతే వినియోగదారుల ఫోరంను ఆశ్రయిస్తుంటారు.
పంజాబ్ లోని లుథియానాకు చెందిన కారు యజమాని ఒకరు వినూత్నంగా నిరసన తెలిపాడు. తన స్కోడా కారుకు రిపేరు రావడంతో కంపెనీ సర్వీసు సెంటర్ కు తీసుకెళ్లాడు. అక్కడగా సరిగా స్పందించకపోడంతో వినూత్న నిరసన చేపట్టాడు. తన కారును గాడిదలతో లాగించి నిరసన తెలిపాడు. కారును గాడిదలు లాక్కెళ్లడం చూసినవారంతా ముక్కన వేసేసుకున్నారు. ఇలాగా కూడా నిరసన తెలపొచ్చా అని చర్చించుకున్నారు.