గుహే గృహం
హోండురాస్: కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న గోడల మధ్య నిల్చొన్న ఈ బామ్మ పేరు డోనా ఫ్రాన్సిస్కా గోమెజ్. ఈమె ఇంటి గోడలు కూలొచ్చేమోగానీ ఇల్లు కూలదు. ఎందుకంటే అది ఇల్లేకాదు. మధ్య అమెరికాలోని హోండురాస్ దేశంలోని అడవి మధ్యలో ఉన్న ఒక గుహ. ఒంటరిగా గత 50 ఏళ్లుగా ఇక్కడే ఉంటోంది. అడవిలో సేకరించిన కొద్దిపాటి కలపను దగ్గర్లోని ఊర్లో అమ్మి కావాల్సిన సరుకులు తెచ్చుకుంటుంది. గతంలో ఇంటిపని చేసేది. భర్త చనిపోయిననాటి నుంచి గుహనే గృహంగా భావించి కాలం వెళ్లదీస్తోంది.