Dornakal Assembly Constituency
-
డోర్నకల్: ఎమ్మెల్యేకు వ్యతిరేకత.. పుంజుకుంటున్న కాంగ్రెస్
2009 నియోజకవర్గాల పునఃర్విభజన వరకు జనరల్ స్థానంగా ఉన్న డోర్నకల్ కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉంది. పునఃర్విభజనతో ఎస్టీ రిజర్వుడుగా మారింది. జనరల్ స్థానంలో ఎమ్మెల్యేగా గెలిచిన రెడ్యానాయక్, ప్రస్తుతం ఎస్టీ రిజర్వుస్థానంలో ఎదురీదే పరిస్థితి ఏర్పడుతుంది. ఒకప్పుడు రాజకీయ ప్రత్యర్థులైన మంత్రి సత్యవతి రాథోడ్, సిట్టింగ్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ బిఆర్ఎస్ పార్టీలో టికెట్ కోసం పోటీ పడ్డారు. కానీ చివరికి అధిష్టానం రెడ్యానాయక్‌కే టికెట్‌ను ఖరారు చేసింది. దాంతో పార్టీ కీలక నేతల్లో అసమ్మతి నెలకొంది. ఎన్నికలను ప్రభావితం చేసే ముఖ్య అంశాలు: గిరిజన ఓటర్లు ఎక్కువగా ఉండే నియోజక వర్గం ఇది. ముఖ్యంగా విద్యా, వైద్యం,స్థానిక సమస్యలు..డబుల్ బెడ్రూం ఇళ్ళు, దళిత బందు పతకాలను పరిమితంగా అమలు చేయడం. సిట్టింగ్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ ఏడు సార్లు పోటీ చేసి ఆరు సార్లు గెలిచిన మంత్రిగా పనిచేసినప్పటికి మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ప్రస్తుతం ఎక్కడికి వెళ్ళిన నిలదీసే పరిస్తితి ఏర్పడింది. ప్రధాన పార్టీల అభ్యర్థులు : బీఆర్ఎస్ రెడ్యా నాయక్ (కన్ఫాం) కాంగ్రెస్ పార్టీ : జాటోత్ రామ చoద్రునాయక్ (ఆశావాహులు) మలోత్ నెహ్రూ నాయక్ (ఆశావాహులు) ననావత్ భూపాల్ నాయక్(ఆశావాహులు) బిజేపి పార్టీ : లక్ష్మణ్ నాయక్ (ఆశావాహులు) రాజకీయ అంశాలు : ఒకప్పటి కాంగ్రెస్ కంచుకోట తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావంతో టిఆర్ఎస్ పాగా వేసి తన బలం పెంచుకుంది. ప్రస్తుతం ఎమ్మెల్యే మీద ఉన్న వ్యతిరేకతతో కాంగ్రెస్ కాస్త పుంజుకునే అవకాశం ఉంది. ఒకప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లాను ఏలిన కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎంపీ రామసహాయం సురేందర్ రెడ్డి రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడంతో ఆయన ప్రభావం డోర్నకల్ నియోజకవర్గంలో చూపే పరిస్థితి కనిపిస్తుంది. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి సైతం కాంగ్రెస్ లో చేరడంతో ఖమ్మం ప్రక్కన డోర్నకల్ పై పొంగులేటి ప్రభావం కనిపించే పరిస్థితి ఉంది. వృత్తిపరంగా ఓటర్లు : గిరిజనులు రైతులు ఎక్కువగా ఉంటారు మతం/కులం వారిగా ఓటర్లు : ఎస్టీ ఓటర్లు 92616 మంది బిసి ఓటర్లు 76 వేల మంది ఎస్సీ ఓటర్లు 29401 మంది ముస్లీం మైనార్టీ ఓటర్లు 6464 మంది నియోజకవర్గంలో బౌగోళిక పరిస్థితులు : వాగులు : పాలేరు, ఆకేరు, మున్నేరు ఆలయాలు : కురవి శ్రీ భద్రకాళీ సమేత వీరద్రస్వామి, నందికొండ గ్రామo శ్రీ లక్ష్మి నరసింహ స్వామీ, నర్సింహులపేట వెంకటేశ్వర స్వామి ఆలయాలు, మరిపెడ మాకుల వెంకటేశ్వర స్వామి, డోర్నకల్ పురాతన శ్రీరాముల వారి ఆలయం(పెరుమండ్ల సంకిసా), చిన్నగూడూరు మండల కేంద్రం దాశరథీ స్వగ్రామం. -
డోర్నకల్ (ఎస్టి) నియోజకవర్గ గత చరిత్ర ఇదే..మరి ఇప్పుడు..?
డోర్నకల్ (ఎస్టి) నియోజకవర్గం డోర్నకల్ రిజర్వుడ్ నియోజకవర్గంలో గిరిజన నేత డి.ఎస్.రెడ్యా నాయక్ ఆరోసారి విజయం సాదించారు. గతంలో ఈ నియోజకవర్గం జనరల్ సీటుగా ఉన్నప్పుడు ఈయన నాలుగు సార్లు గెలవడం ఒక ప్రత్యేకతగా చెప్పాలి. 2014లో రెడ్యానాయక్ కాంగ్రెస్ ఐ పక్షాన గెలిచినా, ఆ తర్వాత టిఆర్ఎస్లోకి మారిపోయారు. తదుపరి 2018లో టిఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీచేసి తన సమీప కాంగ్రెస్ ప్రత్యర్ధి రామచంద్రునాయక్ పై 17511 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. రెడ్యా నాయక్‌కు 88307 ఓట్లు రాగా, రామచంద్రు నాయక్‌కు 70926ఓట్లు వచ్చాయి. ఇక్కడ ఇండిపెండెంట్ అభ్యర్ధిగా పోటీచేసిన బి.రవీందర్‌కు నాలుగువేల ఓట్లు వచ్చాయి. డోర్నకల్‌లో రెడ్యానాయక్ 2009లో ఓడిపోయినా, 2014లో తన పాత ప్రత్యర్ధి సత్యవతి రాధోడ్‌ను 23531ఓట్ల తేడాతో ఓడిరచారు. 2014లో తెలంగాణ అంతటా టిఆర్ఎస్ ప్రభజంనం వీచినా ఇక్కడ మాత్రం అది కనిపించలేదు. 2009లో టిడిపి తరపున పోటీచేసి విజయం సాధించిన సత్యవతి 2014లో టిఆర్ఎస్లోకి వెళ్లి పోటీచేసి ఓటమిచెందారు. ఆ తర్వాత కాలంలో ఆమె ఎమ్మెల్సీ అయి 2018 ఎన్నికల తర్వాత కొంతకాలానికి ముఖ్యమంత్రి కెసిఆర్ క్యాబినెట్లో మంత్రి అయ్యారు. 1957లో ఏర్పడిన డోర్నకల్ నియోజకవర్గంలో 13సార్లు కాంగ్రెస్, కాంగ్రెస్ఐ గెలిస్తే, ఒకసారి టిడిపి గెలిచింది. ఒకసారి టిఆర్ఎస్ గెలిచింది. డోర్నకల్‌లో 1972లో నూకల రామచంద్రారెడ్డి ఏకగ్రీవంగా నెగ్గగా, ఆయన అకాల మరణం తర్వాత 1974లో జరిగిన ఉప ఎన్నికలో ఆర్. సురేంద్రరెడ్డి ఏకగ్రీవంగా గెలవడం మరో విశేషం. నూకల మొత్తం నాలుగుసార్లు గెలిచారు. ఆయన తర్వాత రామసహాయం సురేంద్రరెడ్డి మరో నాలుగుసార్లు, తదనంతరం రెడ్యా నాయక్ మరో ఆరుసార్లు గెలిచారు. నూకల గతంలో దామోదరం సంజీవయ్య, నీలం సంజీవరెడ్డి, కాసు మంత్రివర్గాలలో పనిచేశారు. నూకల కొంతకాలం తెలంగాణ ఉద్యమంలో పాల్గొని శాసన సభలో తెలంగాణ యున్కెటెడ్ ఫ్రంట్ ఏర్పడిన శాసనసభ్యుల బృందానికి నాయకత్వం వహించి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా కూడా వున్నారు. రెడ్యానాయక్ 2004లో గెలిచాక వైఎస్ క్యాబినెట్లో మంత్రి అయ్యారు. సురేంద్రరెడ్డి మహబూబాబాద్ నుంచి ఒకసారి, వరంగల్లు నుంచి మూడుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. డోర్నకల్‌లో ఎనిమిది సార్లు రెడ్డి సామాజికవర్గం ఎన్నిక కాగా,నాలుగుసార్లు జనరల్ నియోజకవర్గంగా ఉన్నప్పుడు గిరిజన నేత ఎన్నికవడం విశేషం. డోర్నకల్ (ఎస్టి) నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే..