ఫైనల్లో ఏపీ అమ్మాయిలు
చండీగఢ్: ఇంటర్ స్టేట్-ఇంటర్ జోనల్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ మహిళల జట్టు ఫైనల్లోకి ప్రవేశించింది. షఫీ ఖురేషీ కప్ కోసం జరుగుతున్న ఈ టోర్నీ సెమీఫైనల్లో శుక్రవారం ఏపీ 2-0 తేడాతో చండీగఢ్‌ను చిత్తు చేసింది.
మొదటి సింగిల్స్‌లో రాష్ట్రానికి చెందిన రుత్విక శివాని 21-11, 21-10 స్కోరుతో ముస్కాన్ సోహిపై విజయం సాధించింది. డబుల్స్ మ్యాచ్‌లో రితుపర్ణ దాస్-మేఘన జోడి 21-10, 21-15 తేడాతో ముస్కాన్ సోహి-కైలాష్‌పై గెలుపొందింది. మరో సెమీ ఫైనల్లో ఎయిరిండియా 2-0తో కర్ణాటకను ఓడించి ఫైనల్‌కు చేరుకుంది. పురుషుల విభాగం (నారంగ్ కప్)లో ఎయిరిండి యా 2-0తో మహారాష్ట్రపై, కేరళ 2-0తో చండీగఢ్‌పై గెలిచి ఫైనల్లోకి ప్రవేశించాయి.