యూఎస్‌లో కాల్పులు: ఐదుగురు మృతి
వాషింగ్టన్: అట్లాంటా నగర శివారు ప్రాంతంలోని డగ్లస్వెల్లో విషాదం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన మాజీ భార్య ఇంట్లోకి ప్రవేశించి... విచక్షణరహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో నలుగురు మరణించగా... ఇద్దరు చిన్నారులు గాయపడ్డారు. అనంతరం కాల్పుల జరిపిన వ్యక్తి తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు డగ్లస్ కౌంటీ ఉన్నతాధికారి ఆదివారం వెల్లడించారు. అయితే గాయపడిన ఇద్దరు చిన్నారుల పరిస్థితి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని చెప్పారు. మృతి చెందిన వారిని గుర్తించ వలసి ఉందన్నారు.
కాల్పులు జరిపిన వ్యక్తికి, మరణించిన ఆమెకు విడాకులు తీసుకున్నారా లేదా అనే విషయం తెలియలేదని.... కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. మృతుడు గురించిన వివరాలు వెల్లడించేందుకు పోలీసులు నిరాకరించారు. కాల్పుల ఘటనపై స్థానికులు ఫిర్యాదు చేయడంతో... ఘటన స్థలానికి చేరుకున్నామని పోలీసులు చెప్పారు. ఈ సంఘటన శనివారం చోటు చేసుకుంది.