శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు
తిరుమల: కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరస్వామిని శుక్రవారం ఉదయం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో వచ్చిన ఆయనకు టీటీడీ అధికారులు స్వాగతం పలికి స్వామివారి దర్శన ఏర్పాట్లు చేశారు. శ్రీవారి దర్శన అనంతరం రంగనాయకుల మండపం వద్ద వేదాశీర్వచనం పలికి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించారు.
కొనసాగుతున్న భక్తుల రద్దీ
కాగా తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి ప్రస్తుతం 22 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి 8 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన కొండపైకి వచ్చే భక్తులకు 6 గంటల సమయం పడుతోంది. నిన్న(గురువారం) 82,128 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా, శ్రీవారి హుండీకి రూ. 3.53 కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.