తెలంగాణ ధనిక రాష్ట్రమని చెప్పి...
హైదరాబాద్: వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాలేదంటున్నారని కేసీఆర్ ప్రభుత్వంపై బీజేఎల్పీ నేత డాక్టర్ లక్ష్మణ్ ధ్వజమెత్తారు. బుధవారం హైదరాబాద్లో డాక్టర్ లక్ష్మణ్ మాట్లాడుతూ.. తెలంగాణ ధనిక రాష్ట్రమని చెప్పి ఎఫ్ఆర్బీఎం పెంచమని కేంద్ర ప్రభుత్వాన్ని ఎలా అడుగుతారని కేసీఆర్ ప్రభుత్వాన్ని ఆయన సూటిగా ప్రశ్నించారు.
రైతులకు ఇవ్వాల్సిన భరోసా ఈ బడ్జెట్లో లేదని ఆరోపించారు. రుణమాఫీ అంశమే ప్రస్తావించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ బడ్జెట్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని విమర్శించారు. రూ. 3 వేల కోట్ల మద్యం ద్వారా ఆదాయం పెంచుకోవాలనుకోవడం దారుణమని లక్ష్మణ్ వ్యాఖ్యానించారు.