డీఈఓ వర్సెస్ ఉపాధ్యాయ సంఘాలు
ఆందోళన బాటలో ఉపాధ్యాయులు
లిఖితపూర్వక సమాధానాన్ని
తిరస్కరించిన సంఘాలు
నేడు హన్మకొండలో ర్యాలీ, కార్యాలయం ఎదుట ధర్నా
విద్యారణ్యపురి, న్యూస్‌లైన్: జిల్లా విద్యాశాఖాధికారిగా ఉన్న డాక్టర్ ఎస్.విజయ్‌కుమార్ - ఉపాధ్యాయ సంఘా ల నడుమ ఏర్పడిన అగాధం ఆందోళనలు చేపట్టే స్థాయికి చేరింది. ఉపాధ్యాయుల పని తీరును సలహాలు, సూచనలతో మార్చాల్సిన అధికారి భయాందోళనకు గురిచేస్తున్నారని ఆరోపిస్తున్న వివిధ ఉపాధ్యాయ సంఘాల బాధ్యులు చివరకు సమన్వయ కమిటీగా ఏ ర్పడి ర్యాలీ, ధర్నాలు చేపడుతామని హెచ్చరించారు. ఈ ఆందోళనల్లో భాగంగా మంగళ వారం ర్యాలీ, ధర్నా నిర్వహించనున్నారు.
నేడు ర్యాలీ, ధర్నా
వైఖరి మార్చుకోవడమే కాకుండా సమస్యలు పరిష్కరించాలనే డిమాండ్ చేస్తూ.. స్పందిం చని పక్షంలో మంగళవారం ధర్నా చేయనున్నట్లు గతంలోనే డీఈఓ విజయ్‌కుమార్‌కు ఉపాధ్యాయ సంఘాల బాధ్యులు నోటీసు ఇ చ్చారు. దీనికి ఆయన రాతపూర్వకంగా ఇచ్చి న సమాధానం సంతృప్తికరంగా లేదని పే ర్కొంటూ ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన లు చేపట్టి తీరుతామని స్పష్టం చేశారు.
ఇందులో భాగంగా మంగళవారం ఉదయం 10గంటలకు హన్మకొండ పబ్లిక్ గార్డెన్ నుం చి ర్యాలీగా బయలుదేరి, హన్మకొండలోని డీఈఓ కార్యాలయం వద్ద సాయంత్రం 4గంటల వరకు ధర్నా నిర్వహించనున్నట్లు తెలి పారు. ఈ మేరకు ఉపాధ్యాయ సంఘాల సమన్వయ కమిటీలో ఉన్న ఏపీటీఎఫ్, యూ టీఎఫ్, డీటీఎఫ్, టీడీటీఎఫ్, టీపీఆర్టీ యూ, టీఎన్‌యూఎస్, టీఎస్సీ ఎస్టీయూఎస్ జిల్లా బాధ్యులు ఎం.శ్రీనివాస్, కడారి భోగేశ్వర్, కె.సోమశేఖర్, టి.లింగారెడ్డి, ఎం డీ.అబ్దుల్ అలీం, సంకా భద్రినారాయణ, సయ్యద్ గౌస్, విష్ణువర్ధన్, ఎల్.సంజీవరెడ్డి, గోపీచంద్ తెలిపారు.
డీఈఓ అవినీతి, అక్ర మాలపై ఉన్నతాధికారులు విచారణ జరి పిం చాలని కోరారు. అలాగే, పెండింగ్‌లో ఉన్న వేతన కోతలు, సస్పెన్షన్లను క్రమబద్ధీకరించాలని, అన్ని రకాల డిప్యూటేషన్లు రద్దుచే సి ఆయా ఉపాధ్యాయులను పాఠశాల విధుల కు పంపించాలని, పనిచేయని కాలానికి డ్యూ టీ సర్టిఫికెట్లు ఇవ్వడం మానుకోవాలని డిమాండ్ చేశారు. ఇంకా డీఈఓ కార్యాలయ సుందరీకరణ పేరుతో వసూలు చేసిన నిధు ల ఖర్చుపై సోషల్ ఆడిట్ చేయించాలని కోరారు. ఇంకా పలు డిమాండ్ల పరిష్కారాని కి మంగళవారం చేపట్టనున్న ర్యాలీ, ధర్నాకు ఉపాధ్యాయులు అధికసంఖ్యలో హాజరుకావాలని పిలుపునిచ్చారు.
నోటీసు ఇచ్చిన తర్వాత కూడా...
పాఠశాలల తనిఖీ పేరిట డీఈఓ చేస్తున్న సస్పెన్షన్లు, ఇంక్రిమెంట్ల కోత తమను ఆందోళనకు గురిచేస్తోందని పేర్కొంటూ ఉపాధ్యా య సంఘాల బాధ్యులు ధర్నా నోటీసు ఇ చ్చారు. అయితే, నోటీసు ఇచ్చాక ఆయన వైఖరిలో మార్పు వస్తుందేమోనని భావించ గా.. డీఈఓ అంతగా పట్టించుకోలేదని తెలుస్తోంది. డీఈఓగా విధులు, బాధ్యతలు తన కు తెలుసునని పేర్కొన్న ఆయన సక్రమంగా విద్యాబోధన చేయకుంటే చర్యలు తప్పవని చెబుతూ పర్యవేక్షణ కొనసాగించారు. ధర్నా నోటీసు అందాక ఆరు పాఠశాలలను తనిఖీ చేసిన డీఈఓ విజయ్‌కుమార్.. ఓ ఎయిడెడ్ పాఠశాలలోని ఇద్దరు ఉపాధ్యాయులను సస్పెండ్ చేయాలని యాజమాన్యాన్ని ఆదేశించారు. అలాగే, వర్ధన్నపేటలోని నందనం జెడ్పీ హైస్కూల్లో స్కూల్ అసిస్టెంట్‌ను సస్పెండ్ చేయడమే కాకుండా మరో ముగ్గురి ఇంక్రిమెంట్లలో కోత విధించారు.
ఇదేకాకుం డా జనగామ డివిజన్లోని రెండు ఉన్నత పా ఠశాలల్లో తనిఖీ చేసి 24మంది ఉపాధ్యాయులకు ఒక్కో ఇంక్రిమెంట్ కట్ చేయడం గమనార్హం. కాగా, ధర్నా నోటీసు అందుకున్న డీఈఓ.. కోఆర్డినేషన్ సమావేశం ఏర్పాటుచేసి ఉపాధ్యాయ సంఘాల బాధ్యులను ఆ హ్వానించగా వారు హాజరుకాలేదు. సమస్య ల పరిష్కారానికి రాతపూర్వక హామీ ఇవ్వాలని కోరగా, ఆయన కొన్ని అంశాలపై అందజేశారు. అయితే, వాటితో సంతృప్తి చెందని ఉపాధ్యాయ సంఘాల బాధ్యులు ధర్నాకు సిద్ధమయ్యారు. ఇలా డీఈఓ - ఉపాధ్యాయు ల నడుమ పెరిగిన అగాధం ధర్నాకు దారి తీయగా.. ఇది ఇంకా ఎక్కడి వరకు వెళ్తుందో వేచి చూడాల్సిందే.
ధర్నాకు పీఆర్టీయూ దూరం
ఉపాధ్యాయ సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం చేపట్టనున్న ఆం దోళన కార్యక్రమాల్లో తమ సంఘం పాల్గొన డం లేదని ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూని యన్(పీఆర్టీయూ) జిల్లా అధ్యక్షుడు చీకటి సమ్మయ్య, ప్రధాన కార్యదర్శి పి.శ్రీపాల్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. సంఘాలు అంద జేసిన నోటీసుకు డీఈఓ ఇచ్చిన లిఖితపూర్వక సమాధానం సంతృప్తికరంగా ఉండడం తో ధర్నాలో పాల్గొనొద్దని నిర్ణయించినట్లు ఆయన పేర్కొన్నారు.