పథకాలను చూసి ఓటేయండి
వేలూరు, న్యూస్‌లైన్:
రాష్ట్రంలో అమ్మ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను చూసి ప్రజలు ఓట్లు వేయాలని అన్నాడీఎంకే పార్లమెంట్ అభ్యర్థి సెంగొట్టవన్ ఓటర్లను అభ్యర్థించారు. వేలూరు కార్పొరేషన్లో గురువారం ఉదయం ప్రచారం నిర్వహించారు. అమ్మ పథకాలు దేశ వ్యాప్తంగా అమలు చేయాలంటే ఓటర్లు రెండాకుల గుర్తుపై ఓట్లు వేయాలని కోరారు. ఒక్క అవకాశం కల్పిస్తే వేలూరు కార్పొరేషన్‌లోని తాగునీటి సమస్యతోపాటు పలు సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
ఎమ్మెల్యే డాక్టర్ విజయ్ మాట్లాడుతూ కార్యకర్తలందరూ ఇంటింటికీ వెళ్లి అమ్మ సంక్షేమ పథకాల కరపత్రాలను ఆయుధంగా తీసుకొని ప్రతి ఇంటికి వెళ్లి ఓట్లు వేయాలని కోరాలన్నారు. ఈ సందర్భంగా కొన్ని ప్రాంతాల్లో తాగునీటి సమస్యతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వాటిని పరిష్కరించడంలో ప్రజా ప్రతినిధులు నిర్లక్ష్యం వహిస్తున్నారని నిలదీశారు.
దీంతో ఎమ్మెల్యే వారితో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఆయనతో పాటు మేయర్ కార్తియాయిని, డెప్యూటీ మేయర్ ధర్మలింగం, మాజీ కౌన్సిలర్ జీజీ రవి, జననీ బిగ్ బజార్ అధినేత సతీష్‌కుమార్, విజయకుమార్, కౌన్సిలర్లు, అన్నాడీఎంకే నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.