చీఫ్ పోస్ట్‌మాస్టర్ జనరల్‌గా డాక్టర్ వైపీ రాయ్
భారత తపాలా శాఖ ఆంధ్రప్రదేశ్ సర్కిల్ పోస్ట్‌మాస్టర్ జనరల్‌గా డాక్టర్ వైపీ రాయ్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. చత్తీస్గడ్ సీపీఎంజీగా విధులు నిర్వర్తిస్తోన్న ఆయను ఈ నెల 6న పోస్టల్ డెరైక్టరేట్ ఏపీ సర్కిల్‌కు బదిలీ చేసింది. న్యూఢిల్లీలోని జేఎన్టీయూలో బయోకెమిస్ట్రీలో పీహెచ్డీ చేసిన రాయ్ 1984లో ఇండియన్ పోస్టల్ సర్వీస్‌లో చేరారు. కొన్నాళ్లపాటు ఆర్మీ పోస్టల్లో పనిచేసిన ఆయన రెండేళ్లుగా చత్తీస్గడ్ సీపీఎంజీగా విధులు నిర్వర్తిస్తున్నారు.