పిన్ నంబర్ అడిగాడు.. డబ్బు డ్రా చేశాడు
ఖాతా నుంచి రూ.49,500
తస్కరించిన సైబర్ నేరగాడు
జనగామ : ‘హలో.. మేము బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాం.. మీ ఏటీఎం రెన్యువల్ చేసుకోవాలి.. పిన్ నంబర్ చెప్పండి’ అంటూ ఓ సైబర్ నేరగాడు జనగామ పట్టణానికి చెందిన చిరు వ్యాపారి ఎండీ.జహంగీర్‌కు మంగళవారం ఫోన్ చేశాడు. సెల్ నంబర్ 8404860148 నుంచి కాల్ వచ్చింది. జహంగీర్ తన ఏటీఎం కార్డు పిన్ నంబర్ చెప్పిన నిమిషాల వ్యవధిలోనే సైబర్ నేరగాడు రూ.49,500 డ్రా చేశాడు. అనంతరం ఎస్బీఐకి వెళ్లి అకౌంట్ వివరాలు పరిశీలించగా, డబ్బులు డ్రా అయ్యాయని గ్రహించారు. ఖాతాలో ఉన్న మిగితా రూ.29వేలను వెంటనే జహంగీర్ డ్రా చేసుకున్నాడు. దీనిపై తమకు ఫిర్యాదు చేసినట్లు ఎస్సై సంతోషం రవీందర్ తెలిపారు.