డీఆర్సీ ఎప్పుడు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్:
మొదటి నుంచి కూడా డీఆర్సీ నిర్వహణపై ప్రజాప్రతినిధులకు చిన్న చూపు ఉందనే ఆరోపణలు ఉన్నాయి. నాలుగేళ్లలో దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, జూపల్లి కృష్ణారావు, బస్వరాజు సారయ్య, సబితా ఇంద్రారెడ్డి జిల్లా ఇన్చార్జి మంత్రులుగా పనిచేశారు. ప్రస్తుతం మార్కెటింగ్ శాఖ మంత్రి ముఖేశ్‌గౌడ్ కొనసాగుతున్నారు. శ్రీధర్‌బాబు హయాంలోనే డీఆర్సీ సమావేశాలు సజావుగా జరిగాయి. చివరగా 2012 ఫిబ్రవరి 10న సబితా ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. అప్పటి నుంచి ఇప్పటివరకు 19 మాసాలు గడుస్తున్నప్పటికీ డీఆర్సీని ఏర్పా టు చేయాలన్న ధ్యాస అధికార, ప్రతిపక్ష ప్రజాప్రతినిధులకు లేకుండా పోయింది. గత ఏడాది ఆగస్టులో ఇన్చార్జి మంత్రిగా బాధ్యతలు చేపట్టిన మంత్రి ముఖేశ్‌గౌడ్ ఇప్పటి వరకు జిల్లాలో అడుగు పెట్టలేదు. కనీసం డీఆర్సీ సమావేశాన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచన కూడా చేయకపోవడంపై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. జిల్లా మంత్రి పి.సుదర్శన్‌రెడ్డి మాత్రం అడపాదడపా జిల్లా అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహిం చారు. అయినప్పటికీ సమస్యలు పెండింగ్‌లోనే ఉండిపోయాయి. నేతల అలసత్వం, నిర్లక్ష్యధోరణి జిల్లా ప్రగతికి అడ్డంకులవుతున్నా యి. రైతన్న అష్టకష్టాలు ఎదుర్కొంటుండగా, ప్రజలు ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. ఇన్నాళ్లూ తెలంగాణ ఉద్యమం పేరుతో ప్రజ లకు దూరంగా, ప్రజల బాగోగులు పట్టని విధంగా నేతలు వ్యవహరించారు. ఇప్పుడు మాత్రం తెలంగాణ తెచ్చామన్న పేరుతో సం బరాలకు పరిమితమవుతున్నారన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు.
ప్రాజెక్టులపై శ్రద్ధ ఏదీ?
జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులపైనా ప్రజాప్రతినిధులు దృష్టి సారించడం లేదు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణం పనులు నత్తనడకన సాగుతుండగా, చౌట్పల్లి హ న్మంత్‌రెడ్డి ఎత్తిపోతల పథకం మధ్యలోనే నిలిచిపోయింది. గోదావరిపై మహారాష్ట్ర నిర్మిస్తున్న 14 ప్రాజెక్టులతో జిల్లాలోని గుత్ప, అలీసాగర్ ఎత్తిపోతల పథకాలు, శ్రీరాంసాగర్ ప్రాజెక్టునకు చెందిన లక్ష్మీ కాలువ పరిధిలో మొత్తం 1.60 లక్షల ఆయకట్టు ఎడారిగా మారే ప్రమాదముం ది. ఇటీవల భారీ వర్షాలతో రైతుల పంటలు దెబ్బతిన్నాయి. రైతులకు పంట నష్టపరిహారంపై ప్రజాప్రతినిధులకు పట్టింపు లేదు.
ప్రజాసమస్యలపై పట్టింపు లేదు
నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ (యూజీడీ) పను లు నత్తనడకన సాగుతున్నాయి. రూ. 96 కోట్లతో ఈ ప్రాజెక్టు పనులు చేపట్టగా ఇప్పటి వరకు 70 శాతం మాత్రమే పూర్తయ్యాయి. మాధవనగర్ (ధర్మారం) వద్ద రైల్వేఓవర్ బ్రిడ్జి ఏర్పాటు చేయాలి. నగరం చుట్టూ అసంపూర్తిగా ఉన్న బైపాస్ రోడ్డును పూర్తి చేయాల్సి ఉంది. పనులు ప్రారంభించి ఏళ్లు గడుస్తున్నప్పటికీ ముందుకు సాగడం లేదు. ఆర్మూర్ నియోజకవర్గంలో ఎర్రజొన్న రైతులకు చెల్లిం చాల్సిన బకాయిలు రూ.10.83 కోట్లు పెం డింగ్‌లో ఉన్నాయి. ప్రైవేట్ ఆధీనంలో ఉన్న నిజాం షుగర్ ఫ్యాక్టరీని శాసనసభా సంఘం సూచన మేరకు ప్రభుత్వం స్వాధీనపరుచు కోవాల్సి ఉంది. కామారెడ్డి మంచినీటి పథకం పరిస్థితి కూడా అంతే. రూ. 140 కోట్ల వ్యయం తో 2008లో పనులు ప్రారంభించగా, సకాలంలో పూర్తి కాలేదు. ఫలితంగా అంచనా వ్య యం పెరిగి మరో రూ. 100 కోట్ల నిధుల అవసరం ఏర్పడింది. దీంతో ప్రజలకు తాగునీటిని అందించలేకపోతున్నారు.
ఎడారి దేశాల్లో బతుకు పోరు
జిల్లా నుంచి గల్ఫ్ దేశాలకు బతుకుదెరువుకో సం వెళ్లిన అనేక మంది ఆత్మహత్యలు చేసు కున్నారు. వారి గోడును పట్టించుకునే వారు కరువయ్యారు. కనీస వేతనాలు లేక బీడీ కార్మికుల కుటుంబాలు అర్ధాకలితో అలమటిస్తున్నాయి. వేతనాల జీఓ అమలుపై ప్రజాప్రతినిధులు స్పందించిన దాఖలాలు లేవు.