Dress Up as Mahatma gandhi
-
గాంధీ వేషధారణలో 750 మంది చిన్నారులు
చౌటుప్పల్: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణంలోని ట్రినిటీ హైస్కూల్, గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీ ప్రతిష్టాన్ సంస్థ ఆధ్వర్యంలో సోమవారం స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 750 మంది విద్యార్థులు మహాత్మాగాంధీ వేషధారణలో అలరించారు. చేనేత మగ్గం, రాట్నం, రాట్నంపై నూలు వడికే విధానాన్ని ప్రదర్శించారు. విద్యార్థులంతా జాతీయ జెండాలు చేతబూని దేశభక్తిని చాటిచెప్పారు. -
లాయర్ ఫిర్యాదు, గాంధీ వేషధారి అరెస్ట్
హైదరాబాద్ : జాతిపిత మహాత్మాగాంధీ వేషధారణతో పొగ తాగుతున్న యాచకుడిపై ఓ న్యాయవాది పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో గాంధీ వేషధారిని సుల్తాన్ బజార్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కోఠిలోని గోకుల్‌చాట్ వద్ద ఓ వ్యక్తి గాంధీ వేషధారణతో యాచిస్తూ పొగ తాగుతున్నాడు. ఈ దృశ్యాన్ని చూసిన మోహదీపట్నానికి చెందిన రంజిత్ అనే అడ్వొకేట్ గాంధీని అవమానపరుస్తున్నాడంటూ యాచకుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, గాంధీజీ వేషధారిని అరెస్ట్ చేశారు.