దీపాభరణాలు...
న్యూలుక్
⇒ ఇమిటేషన్ జువెల్రీ, ఫ్యాషన్ జువెల్రీ ఇక ధరించడానికి వీలు లేకుండా ఉన్నా, వాడి వాడి బోర్ కొట్టేసినా వాటిని ఏం చేస్తున్నారు? పండగ వేళకు ఇదిగో ఇలా మార్చేయండి. ఇంటికి, కంటికి కళ పెరుగుతుంది.
⇒ ఎన్నో దీపాలతో అలంకరించే వెలుగుల దీపావళి ఇంకా అందంగా మెరవాలంటే.. దీపాలు పెట్టే అడుగు భాగం మీ పాత ఇమిటేషన్(గిల్టు) ఆభరణాలతో తీర్చిదిద్దండి. కొత్త కాంతితో మెరిసిపోతూ కనులకు విందు చేస్తాయి.
⇒ రకరకాల రంగు పూసలు ఎన్నో ఉంటాయి. వాటిని కలిపి దండలా గుచ్చి గుమ్మానికి వేలాడదీస్తే! ఇలా అందంగా ఉంటుంది. లేదంటే ప్లెయిన్గా ఉండే గోడకు హ్యాంగ్ చేస్తే చాలు.
⇒ ప్లెయిన్ చార్ట్ తీసుకొని పెద్ద చమ్కీలు, పూసలు, ముత్యాలు, కుందన్స్ను అతికించి వేలాడదీస్తే.. వాల్ హ్యాంగింగ్ ఎంత చూడముచ్చటగా ఉంటుందో కదా!
⇒ పాతవైన ఎంబ్రాయిడరీ డ్రెస్సులు, చీరలు, లెహంగాలకు అందమైన డిజైన్స్ ఉంటాయి. వాటిని అలాగే పడేయకుండా జాగ్రత్తగా కట్ చేసి, పూలతో కలిపి రంగవల్లులను దిద్దితే.. పండగ కళ రెట్టింపు అవకుండా ఉండదు.
⇒ ఇలాంటి ఎన్నో ఐడియాలను మీరూ చేయగలరు. ప్రయత్నించండి. పండగ ఆనందాన్ని వెయ్యింతలు చేయండి.