‘ముంపు’పై 30 నుంచి ఆందోళనలు
భద్రాచలం: ముంపు మండలాలను ఆంధ్రలో కలుపుతూ జారీ చేసిన ఆర్డినెన్స్‌ను రద్దు చేయాలనే డిమాండ్‌తో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని జేఏసీ భద్రాచలం డివిజన్ అధ్యక్షుడు చల్లగుళ్ల నాగేశ్వరరావు చెప్పారు. ఖమ్మం జిల్లా భద్రాచలంలో జరిగిన పోలవరం వ్యతిరేక ఐక్యకార్యాచరణ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌తో ముంపు మండలాల్లో తీవ్రమైన ఆందోళన నెలకొన్నప్పటికీ, దీనిపై ప్రభుత్వాలు స్పష్టమైన ప్రకటన చేయకపోవటంఢ దారుణమన్నారు.
విద్యా సంవత్సరం ప్రారంభమైనందున తమ పిల్లలను ఎఢక్కడ చదివించుకోవాలో తెలియక ముంపు మండలాల ప్రజానీకం అయోమయంలో ఉన్నారన్నారు. ఈ నెలాఖరున ముంపు మండలాల్లో పదవీ విరమణ చేసే ఉద్యోగుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమైనా దీనిపై స్పష్టత ఇవ్వాలని కోరారు. ముంపు మండలాలను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకునేది లేదని స్పష్టం చేశారు.
కమిటీ చైర్మన్ వట్టం నారాయణ మాట్లాడుతూ ఈ నెల 30 నుంచి వరుసగా ఆందోళన కార్యక్రమాలను చేపట్టనున్నట్లు తెలిపారు. ఏడు మండలాల్లో బంద్‌లు, విద్యాసంస్థల బంద్‌లకు పిలుపునివ్వనున్నట్లు చెప్పారు. ఈ ఆందోళన కార్యక్రమాల్లో అన్ని రాజకీయ పార్టీలు, గిరిజన, ప్రజా సంఘాల వారు పాల్గొనాలని పిలుపునిచ్చారు.