ఇద్దరు యువకుల దుర్మరణం
ఏలూరు అర్బన్ : రెండు వేర్వేరు రైలు ప్రమాదాల్లో ఇద్దరు మరణించారు. పోలీసుల కథనం ప్రకారం.. స్థానిక కొత్తపేటకు చెందిన తాతపూడి రమేష్ (22) కూలి పనులు చేసుకుని జీవిస్తున్నాడు. తల్లిదండ్రులు 15ఏళ్ల కిందటే చనిపోవడంతో బంధువుల వద్ద పెరిగాడు. మద్యానికి బానిసై జులాయిగా తిరుగుతున్నాడు. బుధవారం రాత్రి మద్యం తాగి పవర్పేట గేటు వేసి ఉండగా.. తూలుతూ పట్టాలు దాటేందుకు యత్నించాడు. అదే సమయంలో విశాఖ నుంచి విజయవాడ Ðð ళ్తున్న ఎక్స్ప్రెస్ రైలు ఢీకొట్టింది. అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు మృతదేహాన్ని ఏలూరు ప్రభుత్వాస్పత్రికి పోస్ట్మార్టం నిమిత్తం తరలించారు.
రైలు నుంచి జారిపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి
రైలు నుంచి ప్రమాదవశాత్తూ జారి పడి మరో యువకుడు వృుతి చెందాడు. విశాఖపట్నం నుంచి విజయవాడ వెళ్తున్న రైలు నుంచి సుమారు 20ఏళ్ల వయసున్న యువకుడు దెందులూరు మండలం అలుగులగూడెం ప్రాంతంలో బుధవారం రాత్రి రైలు నుంచి జారిపడ్డాడు. అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. మృతుని శరీరంపై పసుపు రంగు టీ షర్ట్, నీలం రంగు జీన్స్ప్యాంట్ ఉన్నాయి. సమాచారం తెలిసిన వారు 9440627572 నంబరుకు తెలిజేయాలని పోలీసులు సూచించారు.