రవాణా శాఖలో ఆన్లైన్ రిజిస్ట్రేషన్
అనంతపురం సెంట్రల్ : గుత్తిరోడ్డులోని దుర్గా ఆటోమోటివ్్స లో రోడ్డు రవాణాశాఖ ఆధ్వర్యంలో ప్రజల ముంగిట రవాణాశాఖ ఆన్లైన్ సేవలు– డీ లర్ వద్దే వాహన శాశ్వత రిజి స్ట్రేషన్ విధానం ప్రారంభోత్స వ కార్యక్రమం సోమవారం ని ర్వహించారు. రవాణాశాఖ డీ టీసీ సుందర్ వడ్డి మాట్లాడు తూ ఆన్లైన్ విధానం ద్వారా వాహనం కొనుగోలు చేసిన రోజే డీలర్ వద్ద వినియోగదారులకు తాత్కాలిక రిజిస్ట్రేషన్(టీఆర్) మంజూరు చేస్తారని, 24 గంటల్లో శాశ్వత రిజిస్ట్రేషన్ వారి ఇంటికే పంపుతామన్నారు. జిల్లా ఎస్పీ రాజశేఖర్‌బాబు మాట్లాడుతూ గతంలో డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలంటే రోజుల తరబడి ఆర్టీఏ కార్యాలయం ముందు పడిగాపులు కాయాల్సి వచ్చేదని గుర్తు చేశారు. అలాంటి స్థానంలో మొబైల్ ద్వారా సేవలు పొందే అవకాశాన్ని కల్పించడం శుభపరిణామమన్నారు. ఈ సందర్బంగా సోమవారం వాహనం కొనుగోలు చేసిన రామ్‌ప్రసాద్‌రెడ్డి, పుండరీకాక్షలకు ఆన్లైన్లోనే రిజిస్ట్రేషన్ చేయించి సర్టిఫికెట్లను అందజేశారు. కార్యక్రమంలో చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు, ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరి, మేయర్ స్వరూప, డిప్యూటీ మేయర్ గంపన్న, దుర్గా ఆటోమోటివ్స్ మేనేజర్ వెంకటేశ్వర్లు, సీఈఓ రాజేష్, డైరెక్టర్ మహేష్, ఆర్టీఓ శ్రీధర్, మోటర్‌వెహికల్ ఇన్స్పెక్టర్లు వరప్రసాద్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.