అత్యాచార బాధితురాలికి సంఘీభావంగా వెళ్తే.. కత్తితో దాడి!
జైపూర్( ఒడిస్సా): రాష్ట్రంలోని జైపూర్ జిల్లాలో బాలికల కాలేజీలో చదువుతున్న ఓ బాలికపై అగంతకులు దాడి చేశారు. ఈ దాడిలో ఆమె తీవ్రంగా గాయపడింది. ఆమెను చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం బాధితురాలిని మెరుగైనా చికిత్స కోసం కటక్‌లోని ఎస్సీబీ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి మార్చారు.
వివరాల్లోకి వెళితే..
గాయపడిన బాలిక జైపూర్‌లోని సుకందా కాలేజీలో ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఆమె రోజులాగే కాలేజీ నుంచి తన స్నేహితులతో కలిసి జాతీయ రహాదారి-200పై ఉన్న బస్టాప్ వద్ద బస్సుకోసం ఎదురుచూస్తోంది. ఆ సమయంలో గుర్తుతెలియని యువకులు ఒక్కసారిగా ఆమెపై పదునైనా కత్తితో దాడికి దిగారు. ఈ దాడిలో ఆమెకు తీవ్రగాయాలయ్యాయి.
కిడ్నాప్‌కు గురైన బజీ రూట్ మెమెరీయల్ కాలేజీలో చదువుతున్న ఓ విద్యార్ధిని అనంతపురంలోని బోతలండా అడవి సమీపంలో గురువారం హత్యాచారానికి గురైంది. ఈ ఘటనపై నిరసిస్తూ విద్యార్ధులంతా సంఘీభావం తెలుపుతూ శుక్రవారం ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో గాయపడిన బాధితురాలు కూడా పాల్గొంది. ర్యాలీలో పాల్గొన్న అనంతరం ఆమె తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
బాలికపై దాడి జరిగినట్టు వార్తలు రావటంతో ఆప్రాంతంలో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. సుకిందా కాలేజీ విద్యార్ధులంతా దాడిచేసినా నిందితులపై చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. నిందితులను వెంటనే అదుపులోకి తీసుకోవాలంటూ దుబూరి- సుకిందా జాతీయ రహాదారి -200 ను దిగ్భందం చేశారు. దీంతో మూడుగంటలపాటు రోడ్డుపై వాహనాలు నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. చివరకు పోలీసులు, తహసిల్దార్ ల జోక్యం చేసుకుని నిందితులను త్వరలో పట్టుకుంటామని హామీ ఇవ్వండంతో వారు ఆందోళనను విరమించారు.