విద్యుదాఘాతంతో మహిళ మృతి
ఖాజీపేట: నందిపాడులో విద్యుత్ ప్రమాదం వల్ల నాగేశ్వర్రెడ్డి అనే వ్యక్తి మృతి చెందిన సంఘటన మరువక ముందే దుంపలగట్టు గ్రామంలో విద్యుదాఘాతానికి గురై మరో మహిళ మృతి చెందింది. దుంపలగట్టు గ్రామానికి చెందిన లక్ష్మిదేవి అనే మహిళకు దువ్వూరు మండలం నాగాయపల్లె గ్రామానికి చెందిన వ్యక్తితో వివాహమైంది. అయితే భర్త కువైట్కు వెళ్లడంతో గత కొంతకాలంగా ఆమె దుంపలగట్టులోని పుట్టింట్లో ఉంటోంది. ఆదివారం సాయంత్రం ఉతికిన దుస్తులను ఇనుప దంతెపై వేసేందుకు ప్రయత్నించగా దానికి విద్యుత్ సరఫరా అయి అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలికి లలిత (8) అనే కుమార్తె ఉంది.