మనుషుల్లాగే నడిచే రోబో
వాషింగ్టన్: మనుషుల్లానే కాళ్లకు షూ వేసుకుని నడిచే రోబోలను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. అది మనలా నడవటమే కాకుండా నడకలో మనుషుల్ని అనుకరిస్తుంది కూడా. ఈ రోబోలు మానవుల మడమ, బొటనవేలిని తల పించే నిర్మాణాల సాయంతో నడుస్తాయి. దీని సాయంతో అవి మనుషుల నడకను అనుకరించగలవు. ఈ హ్యూమనాయిడ్ రోబోకి వారు డ్యూరస్ అని పేరు పెట్టారు.
డ్యూరస్కి ముందున్న రోబో కాళ్ల నిర్మాణంలో కొన్ని మార్పులు చేసి దీన్ని తయారు చేశారు. నడిచే దారిని బట్టి నడకను మెరుగుపరుచుకునేలా ప్రోగ్రాం చేశారు. ఈ ప్రోగ్రాం దారి సవ్యంగా లేనప్పుడు అది కింద పడే అవకాశాన్ని తగ్గిస్తుంది.