‘దూసుకెళ్తా’ ఆడియో విడుదల
మంచు విష్ణు కథానాయకుడిగా వీరు పోట్ల దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘దూసుకెళ్తా’. అరియానా, వివియానా సమర్పణలో డా.మోహన్‌బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మణిశర్మ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను శనివారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. దాసరి ఆడియో సీడీని ఆవిష్కరించి తొలి ప్రతిని కె.రాఘవేంద్రరావుకు అందించారు.