గడువు పొడిగించవద్దని రాస్తారోకో
నల్లగొండ రూరల్, న్యూస్‌లైన్: తెలంగాణ బిల్లు గడువును పొడిగించవద్దని టీఎన్జీఓ సెంట్రల్ యూనియన్ అధ్యక్షుడు దేవీప్రసాద్, టీజేఎఫ్ జిల్లా కన్వీనర్ దూసరి కిరణ్‌కుమార్‌గౌడ్‌లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. టీ-బిల్లు గడువును పొడిగించవద్దని తెలంగాణ జర్నలిస్టుల ఫోరం ఆధ్వర్యంలో నల్లగొండలోని క్లాక్‌టవర్ వద్ద మంగళవారం రాస్తారోకో నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడారు. బిల్లు గడువును పొడిగించి సీమాంధ్రులు రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునేందుకు కుటిల ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. బిల్లు గడువును పొడిగిస్తే మరో ఉద్యమాన్ని నిర్వహిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో డాక్టర్స్ జేఏసీ నాయకుడు బూర నర్సయ్యగౌడ్, దుశ్చర్ల సత్యనారాయణ, రవీందర్‌రెడ్డి, వెంకటేశ్వరమూర్తి, జి.వెంకటేశ్వర్లు, గోలి విజయ్, సైదులు, వెంకన్న, రామకృష్ణ, కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.