డిమాండ్‌కు అనుగుణంగా ‘హమ్‌సఫర్’ చార్జీలు
న్యూఢిల్లీ: రైల్వే శాఖకు తగ్గుతున్న ఆదాయం నేపథ్యంలో ‘హమ్‌సఫర్’ రైళ్లలో డిమాండ్‌కు అనుగుణంగా చార్జీలు వసూలు చేయాలని నిర్ణయించింది. మొత్తం ఏసీ–3 టైర్ బోగీలతో కూడిన ‘హమ్‌సఫర్’ కొత్త ఎక్స్‌ప్రెస్ రైళ్లను త్వరలో ప్రవేశపెట్టనున్నారు.
ప్రతి కేబిన్‌లో కాఫీ, టీ, సూప్ వెండింగ్ మిషన్, రిఫ్రిజిరేటర్ ఉన్న పాంట్రీతో పాటు మరిన్ని సదుపాయాలను ఏర్పాటు చేయనుంది. తొలి రైలును ఢిల్లీ నుంచి గోరఖ్‌పూర్ మధ్య వచ్చే నెల మొదటి వారంలో ప్రారంభించనుంది.