ఖేడ్మే భారీష్
కొట్టుకుపోయిన కల్వర్టులు
55.4మి.మీ. వర్షపతం నమోదు
నేలకూలిన విద్యుత్స్తంభాలు
మెతుకుసీమపై వరుణుడు కరుణచూపుతున్నాడు.. జిల్లా అంతటా వర్షాలు కురుస్తున్నాయి. నారాయణఖేడ్ నియోజకవర్గంలో భారీ వర్షం కురిసింది. బుధవారం నుంచి ప్రారంభమైన వాన గురువారం ఉదయం వరకు కొనసాగింది. ఖేడ్లో 55.4 మిల్లీమీటర్ల వర్షం పాతం నమోదైనట్టు రెవెన్యూ అధికారులు తెలిపారు. నారాయణఖేడ్ నుంచి రాయిపల్లి రూట్లో రుద్రారం, పోచారం గ్రామాల సమీపంలో తాత్కాలికంగా నిర్మించిన కల్వర్టులు కొట్టుకుపోయాయి.
దీంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. భారీ ఈదురుగాలులకు మనూరు మండలం బెల్లాపూర్ సబ్స్టేçÙన్ సమీపంలో విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఇదిలా ఉంటే.. మంజీర నదిలోకి వరద నీరు వచ్చి చేరుతోంది. రెండు రోజులుగా ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు నదిలోకి నీరు వస్తోంది. మరోవైపు.. జిల్లాలోని మధ్య తరహ ప్రాజెక్టు నల్లవాగులో నీటి మట్టం పెరిగింది.
పక్షం రోజుల క్రితం 1483 అడుగులు ఉండగా.. ఒక అడుగు పెరిగింది. మరో 9 అడుగులకు నీరు చేరితే ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండే అవకాశం ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1493 అడుగులు. ప్రాజెక్టు నిండితే కుడి కాల్వల పరిధిలోని సుల్తానాబాద్, గోసాయిపల్లి, పోచాపూర్, బీబీపేట, ఖానాపూర్(కె), కృష్ణపూర్, మార్డి, ఇందిరానగర్, కలే్హర్లో 4,100 ఎకరాలు, ఎడమ కాల్వ పరిధిలోని బొక్కస్గాం, అంతర్గాం, నిజామాబాద్ జిల్లా మార్దండ, తిమ్మనగర్లో 1230 ఎకరాల వరకు ఆయకట్టు భూములు సాగులోకివస్తాయి. –నారాయణఖేడ్/మనూరు/కలే్హర్