‘తీవ్ర’ తనిఖీలు
= పుత్తూరు ఘటనతో అప్రమత్తమైన పోలీసులు
= జిల్లా అంతటా విస్తృత తనిఖీలు
= కొత్త వారు వస్తేసమాచారమివ్వాలని విజ్ఞప్తి
= ఆందోళనలో ప్రజలు
సాక్షి, తిరుపతి/పుత్తూరు, న్యూస్‌లైన్: జిల్లాలో వారం కిందట తీవ్రవాదులు ప ట్టుబడడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అనుమానిత ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. వారం కిందట పుత్తూరు పట్టణంలోని గేట్పుత్తూరులో అల్ ఉమా తీవ్రవాదులు బిలాల్, ఇ స్మాయిల్ పట్టుబడిన సంగతి తెలిసిందే. వీరు ఆరు నెలలుగా పుత్తూరులో ఉంటూ తమ కార్యకలాపాలు సాగించారు.
ఇంకో విశేషం ఏం టంటే బిలాల్ భార్యాబిడ్డలతో పాటు ఇక్కడ ఉండగా, వీరిని ఇక్కడికి తీసుకొచ్చిన ఫక్రుద్దీన్ ఏడాదిన్నర పాటు పుత్తూరులోనే ఉన్నాడు. వీరంతా పోలీసులకు పట్టుబడడంతో జిల్లా ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో పట్టుబడిన తీవ్రవాదులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ముమ్మర తనిఖీలు ప్రారం భించారు. రెండు రోజుల క్రితం పుంగనూరులోని నక్కబండ ప్రాంతాన్ని తనిఖీ చేసిన వి షయం విదితమే. అక్కడ ప్రతి ఇంటినీ తనిఖీ చేశారు. ఇద్దరిని అ రెస్టు చేసినట్లు తెలుస్తోంది.
చింతపండు మాటున మారణాయుధాలు
తీవ్రవాది ఇస్మాయిల్ చింతపండు వ్యాపారం చేస్తూ, అందులో మారణాయుధాలను రవాణా చేసినట్లు తెలుస్తోంది. బెంగళూరు నుంచి ఆ యుధాలను, పేలుడు పదార్థాలను తీసుకొచ్చి వాటిని చింతపండు బాక్సుల్లో పెట్టి చెన్నైకు రవాణా చేసినట్లు ఇస్మాయిల్ వెల్లడించాడని స మాచారం. ఈ చింతపండును జిల్లాలోని కు ప్పం, మదనపల్లె, పలమనేరు, పీలేరు, పుంగనూరు నుంచి సేకరించామని, దీనికిగాను తమకు ఏజెంట్లు ఉన్నారని ఇస్మాయిల్ విచారణలో తెలి పినట్లు సమాచారం. అందుకే ఈ ప్రాంతాల్లో సిబ్బందిని పోలీసు ఉన్నతాధికారులు అప్రమత్తం చేశారు.
సరిహద్దులో ఉండడంతోనే పుత్తూరులో..
ఆంధ్ర-తమిళనాడు సరిహద్దులో ఉండడంతోనే పుత్తూరును తమిళనాడు రాష్ట్రం మధురై ప్రాంతానికి అల్ఉమా తీవ్రవాదులకు తమ కార్యకలాపాలకు కేంద్రంగా ఎంచుకున్నట్టు తెలుస్తోంది. పథకం ప్రకారం తమ టార్గెట్‌లో ఉన్న పలువురు బీజేపీ అగ్రనేతలను మట్టుబెట్టడం, హిందూ దేవాలయాలు, తిరుమల వంటి చోట్ల విధ్వం సం సృష్టించడానికి పుత్తూరును స్థావరం చేసుకున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడయినట్టు సమాచారం. దీం తో అప్రమత్తమైన పోలీసులు జిల్లాలో అనుమానం ఉన్న అన్ని ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నారు.
ఆందోళనలో ప్రజలు
దేశవ్యాప్తంగా ఖ్యాతి పొందిన తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలను తీవ్రవాదులు తమ టార్గెట్‌గా చేసుకోవడం జిల్లా ప్రజలను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. దీనికి తోడు ఆరు నెలలుగా ఇద్దరు తీవ్రవాదులు పుత్తూరులో అద్దె ఇంటిలో ఉండడం జిల్లా వాసులను మరింత కలవరపరుస్తోంది. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి పుంగనూరులో పోలీసులు పెద్ద ఎత్తున తనిఖీలు చేపట్ట డం వీరి ఆందోళనను మరింత పెంచుతోంది. ప్రస్తుతం ఏ కొత్త ముఖం కనిపించినా జిల్లావాసులు అనుమానించే పరిస్థితి నెలకొంది. పోలీసులు పటిష్ట చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
పక్కాగా సమాచారం లేదు
జిల్లాలో ఉగ్రవాదులు ఉన్నట్లు ప క్కాగా సమాచారం లేదు. అయి నా నిర్లక్ష్యం చేయడం లేదు. అనుమానిత ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నాం. కొత్తవారు వస్తే వెంటనే సమాచారమివ్వాలని ప్రజలను కోరుతున్నాం. లాడ్జీలలో గదులిస్తే పక్కాగా సమాచారం తీసుకోవాలని ఆదేశించాం. పోలీసు సిబ్బందిని అప్రమత్తం చేశాం.
-కాంతిరాణాటాటా, ఎస్పీ
మా జాగ్రత్తలో మేమున్నాం
తిరుమల, తిరుపతికి ప్రమాదముందని ప్రత్యేకంగా సమాచా రం లేదు. తిరుపతికి రోజూ 50 వేలమంది కి పైగా భక్తులు వ స్తుంటారు. మా జాగ్రత్తలో మేమున్నాం. సిబ్బందిని అప్రమత్తం చేశాం.
-రాజశేఖర్ బాబు, ఎస్పీ, తిరుపతి అర్బన్