ఈ ట్రేడింగ్ పై మిర్చి వ్యాపారుల ఆందోళన
గుంటూరు: గుంటూరు మార్కెట్ యార్డులో సోమవారం వ్యాపారులు ఆందోళన చేపట్టారు. ఈ- ట్రేడింగ్ విధానం, మిర్చి కమీషన్ ఏజెంట్ల లైసెన్స్ ల రెన్యువల్ ప్రక్రియలో ఏర్పడుతున్న ఇబ్బందులపై చిల్లీస్ మర్చంట్స్ అసోసియేషన్ యార్డులో బంద్ పాటిస్తోంది. ఈ నేపథ్యంలో వ్యాపారులు కొనుగోళ్లను నిలిపివేశారు. మంగళవారం కూడా బంద్ కొనసాగుతుందని వ్యాపారులు తెలిపారు. బుధవారం నుంచి మార్కెట్ యార్డులో వ్యాపార లావాదేవీలు యథావిధిగా కొనసాగుతాయి.