దేశంలో తొలిసారి తెలంగాణలో 'ఈ-వాహన్ బీమా'
హైదరాబాద్: దేశంలోనే తొలిసారిగా 'ఈ-వాహన్ బీమా' అనే విధానాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిందని పంచాయతీరాజ్, ఐటీశాఖల మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఐఆర్డీయే సూచనల ప్రకారం రవాణాశాఖ, పోలీసు, ఐటీ శాఖలు సంయుక్తంగా ఈ విధానాన్ని ప్రవేశపెట్టాయని మంత్రి తెలిపారు. సిఫీ కంపెనీ భాగస్వామ్యంతో ఫుజిస్టు యాజమాన్యం వారు ప్రపంచంలో అత్యంత పెద్దదైన గ్లోబల్ డెలివరి సెంటర్ను హైదరాబాద్లో నెలకొల్పనున్నట్లు కేటీఆర్ వివరించారు.
ఈ గ్లోబల్ డెలివరి సెంటర్ ఏర్పాటు నిమిత్తం 135 కోట్ల వ్యయాన్ని వెచ్చించనున్నారని పేర్కొన్నారు. సెంటర్ ఏర్పాటుతో మూడువేల మందికి ఉద్యోగాలు వస్తాయన్నారు. డాటా కేంద్రాలకు హైదరాబాదే అత్యుత్తమ ప్రాంతమని.. దీంతో పాటు నగరంలో డాటా సెంటర్ పార్క్ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు.