ఎంసెట్ పరీక్ష: ఎన్ -1 ప్రశ్నాపత్రం ఎంపిక
కాకినాడ : నేడు ఎంసెట్ పరీక్ష నేపథ్యంలో కోడ్ ఎన్ -1 ఇంజినీరింగ్ ప్రశ్నాపత్రాన్ని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఎంపిక చేశారు. శుక్రవారం కాకినాడ జేఎన్టీయూలో ఆయన ఈ ఎన్ - 1 ప్రశ్నాపత్రాన్ని ఎంపిక చేశారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె దృష్ట్యా ఓ నిమిషం నిబంధన సడలించినట్లు ఎంసెట్ కన్వీనర్ సాయిబాబు కాకినాడలో వెల్లడించారు. ఆలస్యంగా వచ్చిన అభ్యర్థుల గురించి పరిశీలించాలని ఇప్పటికే రీజనల్ కో ఆర్డినేటర్లకు సూచించామని సాయిబాబు తెలిపారు.
ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి నేలకొంది. దాంతో తాత్కాలిక ఉద్యోగులతో ఆర్టీసీ బస్సులు నడిపేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఎంసెట్ పరీక్ష ఉదయం 10.00 గంటల నుంచి మధ్యాహ్నం 1.00 గంట వరకు జరగనుంది.